E-Paper
Advertisement

సుప్రీం కోర్ట్ సీజేఐపై పేపర్లు విసిరి, దుర్భషలాడుతూ.. పిటీషనర్ హంగామా, వీడియో వైరల్

సుప్రీం కోర్ట్ సీజేఐపై పేపర్లు విసిరి, దుర్భషలాడుతూ.. పిటీషనర్ హంగామా, వీడియో వైరల్
Advertisement

Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అరుదైన, అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన ఒక పిటిషనర్, ఏకంగా ధర్మాసనానికే ఆదేశాలు జారీ చేస్తూ రచ్చ చేయడం అక్కడ ఉన్నవారందరినీ షాక్‌కు గురిచేసింది. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ హైడ్రామా నడిచింది. ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి తన కేసు విచారణ సందర్భంగా కోర్టు గదిలోకి ప్రవేశించి, తనే ఒక సార్వభౌముడిని  అంటూ వింతగా పరిచయం చేసుకున్నాడు.

‘నాకు నువ్వు ఆర్డర్ వేస్తున్నావా?’.. అసలేం జరిగిందంటే?
లక్నో సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసే ఒక ఏఎస్‌పీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సదరు పిటిషనర్ వాదనలు ప్రారంభించాడు. ఈ క్రమంలో న్యాయమూర్తులను జ్యూడిషియల్  సర్వెంట్స్ అని సంబోధిస్తూ.. “లక్నో ఏఎస్‌పిపై వెంటనే కేసు నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను” అంటూ న్యాయమూర్తులపైనే హుకుం జారీ చేశాడు. దీనిపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన జస్టిస్ విశ్వనాథన్.. “మీరు మాకే ఆజ్ఞలు ఇస్తున్నారా?” అని నమ్మలేనట్టుగా ప్రశ్నించారు. అంతటితో ఆగని ఆ వ్యక్తి, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఉద్దేశించి దూషణలకు దిగుతూ, చేతిలోని కాగితాలను గాల్లోకి విసిరి కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించాడు.

Advertisement

క్షమించిన సుప్రీంకోర్టు..
ఈ రసాభాసతో అప్రమత్తమైన కోర్టు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అతడిని గది వెలుపలికి లాక్కెళ్లారు. అనంతరం కోర్టు ఆవరణలోని డీఎస్పీ కార్యాలయంలో కొంతసేపు నిర్బంధించారు. సాధారణంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ, సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ అత్యంత మానవతా దృక్పథాన్ని చాటుకుంది. సదరు పిటిషనర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. “అతను తీవ్ర నిరాశ, మానసిక వేదనలో ఉన్నాడు. అతనిపై మాకు సానుభూతి మాత్రమే ఉంది” అని పేర్కొంటూ, కేసు మెరిట్స్‌ను బట్టి అతడి పిటిషన్‌ను కొట్టివేస్తూ విషయాన్ని ముగించింది.

కోర్టు గది క్లిప్పింగులపై న్యాయవాదుల సంఘం ఫైర్
అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు వాదనల న్యాయవాదుల సంఘం (SCBA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ముఖ్యంగా, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కోర్టు గదికి సంబంధించిన వీడియో క్లిప్‌లను ఎంపిక చేసిన రీతిలో  ప్రచారం చేస్తూ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సంస్థ గౌరవాన్ని, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తక్షణమే కఠినమైన సంస్థాగత చర్యలు చేపట్టాలని సంఘం డిమాండ్ చేసింది.

Advertisement

2024లోనూ..

2024 మే నెలలొ కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా కోర్టులకు వేసవి సెలవులు  ప్రకటించిన ఆ సమయంలో, అత్యవసర కేసులను వినడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెకేషన్ బెంచ్ విచారణలు జరుపుతోంది. ఆ మే నెల నాటి ఒక సాధారణ రోజున, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ నాటకీయ పరిణామాలు జరిగాయి. అయితే, సెలవుల కారణంగా కోర్టు ప్రాంగణం సాధారణ రోజుల కంటే కొంత ప్రశాంతంగా ఉన్న తరుణంలో.. ఒక పిటిషనర్ ఏకంగా న్యాయమూర్తులపైనే తిరగబడి, బూతు పదజాలంతో రచ్చ చేయడం 2024 మే నాటి న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.

Also Read: పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో బంధించాం.. ఇక విముక్తి లేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Related News

పూరి జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. జూలై 16 నుంచి అద్భుత ఘట్టం.. 5 కిలోమీటర్ల పరిధిలో నో-ఫ్లయింగ్ జోన్

కరూర్ త్యాగాలకు న్యాయం.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం విజయ్

మైనర్లకు సోషల్ మీడియా క్లోజ్.. తెరవెనుక అసలు ఏం జరుగుతోంది?

అమరనాథ్‌లో ముఖం చాటేసిన శివుడు.. కరిగిపోయిన మంచు లింగం, భక్తులు ఏమంటున్నారు?

మీ దగ్గర రూ.2,000 నోట్లు ఉన్నాయా? ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే నేరుగా మీ అకౌంట్‌కే!

ఎట్టకేలకు పాత పెన్షన్ స్కీమ్.. 22 ఏళ్త తర్వాత ప్రకటన, ఆ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ

Delhi: వాహన యజమానులకు శుభవార్త, తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు

Big Stories

Advertisement
×