Korean Survival Thriller OTT : ఎవరైనా ట్రిప్ కి వెళ్తే జీవితాంతం దాచుకునే అందమైన మెమరీస్ ను తోడుగా తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ అవి స్వీట్ మెమరీస్ గా కాకుండా నైట్ మేర్స్ లా మారితే… అద్భుతమైన అడవిలో ప్రాణాలతో పోరాడాల్సి వస్తే… ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ను చూడాల్సిందే. 2017లో విడుదలై కొరియన్ టీవీ సిరీస్‌లలో సూపర్ హిట్‌గా నిలిచిన మిస్టరీ, థ్రిల్లర్, సర్వైవల్ డ్రామా Missing 9. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సిరీస్ స్టోరీ ‘లెజెండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థకు చెందిన పాప్ స్టార్స్, యాక్టర్స్, స్టాఫ్ కలిసి ఒక ప్రైవేట్ విమానంలో కన్సర్ట్ కోసం బయలు దేరడంతో షురూ అవుతుంది. విమానం మధ్యలో వాతావరణం అనుకూలించక ప్రమాదానికి గురవుతుంది. జర్నీ చేస్తుండగానే… సముద్రం మధ్యలో ఉన్న ఒక నిర్జన ద్వీపంలో కూలిపోతుంది. ఆ విమానంలో ఉన్నవారిలో కేవలం 9 మంది మాత్రమే ప్రాణాలతో బయట పడతారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఆ దీవిలో వారు బతకడానికి పోరాడాల్సి వస్తుంది.
ఆ దీవి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అందులో దాగి ఉన్న ప్రమాదాలు అత్యంత భయంకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ జెన్ జెడ్ గ్యాంగ్ అంతా సిటీలో బతకడానికి అలవాటు పడి ఉంటారు. అలాంటి వాళ్ళు అడవిలో బతకడం చాలా కష్టం. కాబట్టి ఆహారం, నీరు, ఆశ్రయం లేకుండానే కొన్ని రోజులు గడుపుతారు. ఈ క్రమంలో వారి మధ్య ఉన్న పాత గొడవలు, ఈగోలు, ఈర్ష్యలు ఒక్కొక్కటిగా బయట పడతాయి.
ఒకప్పటి స్నేహితులు ఒకరినొకరు అనుమానించుకుని, శత్రువులుగా మారిపోతారు. దీవిలో కేవలం ప్రకృతి సవాళ్లతోనే కాదు, వారిలోనే దాగి ఉన్న క్రూరమైన హంతకుడి నుండి కూడా ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తుంది. 4 నెలల తర్వాత రా బాంగ్-హీ అనే అమ్మాయి మాత్రమే ఒంటరిగా సౌత్ కొరియాకు తిరిగి వస్తుంది. మిగిలిన 8 మంది ఏమయ్యారు ? అని దేశమంతా ఆమెను ప్రశ్నిస్తుంది. కానీ ఆ ప్రమాదం జరిగిన 4 నెలల జ్ఞాపకాలను బాంగ్-హీ పూర్తిగా మరిచిపోతుంది.
ఆమె మెమరీ లాస్‌తో బాధపడుతుంటే… మరోవైపు పోలీసులు, మీడియా, కుటుంబాలు ఆమెను వెంటాడతాయి. నెమ్మదిగా బాంగ్-హీకి గతం గుర్తొస్తుంది. ఆ దీవిలో జరిగిన భయంకరమైన సంఘటనలు, హంతకుడి గురించి, తన స్నేహితుల మధ్య జరిగిన ద్రోహాలు ఒక్కొక్కటిగా అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇంతకీ ఆ దీవిలో ఏం జరిగింది ? అసలు హంతకుడు ఎవరు ? అక్కడి నుంచి ఈ అమ్మాయి మాత్రమే ఎలా బయటపడింది ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్.
Also Read : కొడుకును కోసం కాళీమాతలా మారే తల్లి… మదర్ సెంటిమెంట్ తో మెంటలెక్కించే థ్రిల్లర్
16 ఎపిసోడ్‌ల సిరీస్ ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ట్విస్ట్‌లు, సస్పెన్స్ తో ఆకట్టుకుంటుంది. MX Player, Airtel Xstream Playలలో తెలుగు డబ్బింగ్ ఆడియోతో అందుబాటులో ఉంది. లెజెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రముఖ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన 9 మంది వ్యక్తుల జీవితాలను ఒక భయంకరమైన దీవి ప్రమాదం ఎలా మార్చేసిందో చూపించిన ఈ సిరీస్ ను సర్వైవల్ థ్రిల్లర్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.