E-Paper
Advertisement

మానవ జాతిని తుడిచి పెట్టడానికి దిగొచ్చే ఏలియన్స్… మస్ట్ వాచ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్

మానవ జాతిని తుడిచి పెట్టడానికి దిగొచ్చే ఏలియన్స్… మస్ట్ వాచ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్
Advertisement

Sci – Fi Adventure Drama OTT : ఎలియన్స్ ఉన్నాయా లేదా ? అనేది నెవర్ ఎండింగ్ డిస్కషన్. కానీ దీనికి సంబంధించి వచ్చే సినిమాలు, సిరీస్ లు మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమాలకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలను ఇష్టపడే వారికోసమే ఈరోజు ఈ సిరీస్ సజెషన్. ఇందులో ఏకంగా మనుషులు – ఎలియన్స్ కొట్టుకు చస్తూ ఉంటారు. మరి ఈ మైండ్ బెండింగ్ యుద్ధంలో గెలిచింది ఎవరు ? ఓడింది ఎవరు ? అన్నది తెలియాలంటే హాలో (Halo 2022-2024) సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 26వ శతాబ్దంలో నడుస్తుంది. 2552వ ఏడాదిలో సాగుతుంది కథ. మనుషులు -‘కోవెనెంట్’ అనే పరగ్రహ జీవుల కూటమి మధ్య జరిగే భయంకరమైన అంతరిక్ష యుద్ధం నేపథ్యంలో సాగుతుంది స్టోరీ. కోవెనెంట్ ఏలియన్స్ మానవులను పూర్తిగా సర్వనాశనం చేయాలని నిర్ణయించుకుని భూమిని టార్గెట్ చేస్తాయి. ఈ యుద్ధంలో మానవాళిని కాపాడటానికి యునైటెడ్ నేషన్స్ స్పేస్ కమాండ్ (UNSC) శాస్త్రవేత్త డాక్టర్ హాల్సీ ‘స్పార్టన్’ అనే సూపర్ సోల్జర్స్ సైన్యాన్ని సృష్టిస్తుంది. ఈ సైన్యానికి నాయకుడు మాస్టర్ చీఫ్ జాన్-117.

Advertisement

జన్యుపరంగా మార్పులు చేసి, ఆయుధాలతో ఈ సూపర్ సోల్జర్లు ఏలియన్స్‌ తో భయంకరమైన యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఒక మిషన్ సమయంలో మాస్టర్ చీఫ్‌కు ‘మ్యాడ్రిగల్’ గ్రహంపై ఒక పురాతన గ్రహాంతర శకటం దొరుకుతుంది. దానిని తాకగానే అతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలు, ఒక వింతైన భారీ వలయం గురించిన దృశ్యాలు కనిపిస్తాయి. ఇంతకాలం కేవలం ఆర్డర్లు పాటించే యంత్రంలా ఉన్న మాస్టర్ చీఫ్‌లో మానవత్వపు ఆలోచనలు, భావాలు మొదలవుతాయి. ఆ శకటం హాలో రింగ్ గురించి రహస్యాలు చెప్పగల ఏకైక క్లూ అని తెలుస్తుంది.

కోవెనెంట్ ఏలియన్స్ మానవాళిని సర్వనాశనం చేయడానికి హాలో రింగ్ అనే అత్యంత శక్తివంతమైన సూపర్ వెపన్‌ను వెతుకుతుంటాయి. మాస్టర్ చీఫ్ తన స్నేహితులు, సహచరులతో కలిసి ఆ రింగ్ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే భయంకరమైన రాజకీయ కుట్రలు ఏంటి ? యుద్ధంలో ఎవరు గెలిచారు ? అనేది సిరీస్‌ ను ఉత్కంఠభరితంగా చేస్తాయి.

Advertisement

Also Read : భూమి బద్దలై భారీ సింక్‌హోల్… కట్ చేస్తే క్రీస్తు పూర్వం 10000 నాటి పాత కాలంలోకి

తెలుగులో స్ట్రీమింగ్ ?

‘హాలో’ యాక్షన్ సిరీస్ JioHotstarలో తెలుగు డబ్బింగ్ ఆడియోతో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ అంశాలన్నీ మిళితమై ఉంటాయి. 2022లో ప్రారంభమైన ఈ సిరీస్ రెండు సీజన్లతో 17 ఎపిసోడ్‌లు వచ్చి సూపర్ హిట్ అన్పించుకుంది. ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సిరీస్ ప్రముఖ ఎక్స్‌బాక్స్ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఈ భారీ బడ్జెట్ సిరీస్ భారతదేశంలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×