BigTV English

Tension in Parliament: ఢిల్లీ కీలక సమావేశాలు.. పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత.. నకిలీ ఆధార్ తో ప్రవేశించిన దుండగులు..

Tension in Parliament: ఢిల్లీ కీలక సమావేశాలు.. పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత.. నకిలీ ఆధార్ తో ప్రవేశించిన దుండగులు..

High Tension in Delhi’s Parliament: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ కీలక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఉదయం ఒక్కసారిగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నంచారు. విషయం తెలుసుకున్న పార్లమెంట్ భద్రతా సిబ్బంది పార్లమెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పట్టుకున్నారు. వీరంతా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసుకొని గేట్ నంబర్ 3 నుంచి పార్లమెంట్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే అనుమానం రావడంతో పార్లమెంట్ భద్రతా సిబ్బంది సీఐఎస్ఎఫ్ బలగాలు ఆ ముగ్గురిని పట్టుకున్నారు.


పోలీసుల అదుపులో అనుమానితులు..

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఐ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో లోపలికి చొరబడేందుకు పయత్నం చేసిన ముగ్గురు అనుమానితులు ఖాసీం, మోనిస్, షోయబ్‌గా గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గతంలో పార్లమెంట్ ఆవరణలోకి కొంతమంది దుండగులు ప్రవేశించిన సంగతి తెలిసిందే.


పార్లమెంట్‌లో తీవ్ర దుమారం..

ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నేపత్యంలో పార్లమెంట్ ప్రాంగణంలో మార్పులు చేస్తున్నారు. ప్రధానంగా మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి మహానీయుల విగ్రహాల స్థానాలను మార్చుతున్నారు. దీంతో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. ఈ విగ్రహాల మార్పుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ ఆవరణలో విగ్రహాలను మార్చడం దుర్మార్గమని, బీజేపీ తీసుకునే నిర్ణయాలు దారుణమని ఆరోపిస్తోంది.

Also Read: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

అసలు ఏంటి సమస్య..?

పార్లమెంట్ రీడెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా మహానీయుల విగ్రహాలు మార్చుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇందులో భాగంగా ల్యాండ్ స్కేపింగ్ ఆధునీకరణ కోసం పార్లమెంట్ విగ్రహాలను ఒకేచోట ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని విగ్రహాలను పాత పార్లమెంట్, పార్లమెంట్ లైబ్రరీ మధ్యలో ఉన్న గార్డెన్ ప్రాంతానికి తరలించారు. అయితే దీనిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడంతో పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఛత్రపతి శివాజీ. అంబేద్కర్ విగ్రహాలను మార్చుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×