Supreme Court: కాక్రోచ్ జనతా పార్టీ ఈనెల 5న ఢిల్లీలో జరుపనున్న నిరసన ప్రదర్శనపై ఎలాంటి అత్యవసర ఆదేశాలు ఇవ్వమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొన్నిరోజుల క్రితం నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేసిన ఆందోళనల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కాగా, తమ డిమాండ్లు కొన్ని ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని చెబుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఈనెల 5న ఢిల్లీలో మరోసారి నిరసన ప్రదర్శనలు జరుపుతామని ప్రకటించారు.
అయితే దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని నిరసన ప్రదర్శనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరాడు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుత దశలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించనున్న నిరసన ప్రదర్శన సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పలేమని పేర్కొంది. దీనిపై ఎలాంటి అత్యవసర ఆదేశాలు జారీ చేయమని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 5న చేపట్టనున్న నిరసనలకు గురించి ఆగస్టు 24వ తేదీనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆందోళనలు చేపట్టడానికి గల కారణాలను ప్రస్తావించింది. ‘ఒక తరం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారిని ఇళ్లకు పంపించేసి, ఆ తర్వాత ఇచ్చిన మాట నుంచి ప్రభుత్వం సైలెంట్‌గా వెనక్కి తగ్గడం ఎంతమాత్రం సరికాదు. ఇచ్చిన మాటను దాటవేసే ఈ నమ్మకద్రోహాన్ని మేము ఏమాత్రం సహించబోము’ అని పార్టీ స్పష్టం చేసింది.
Also Read: నర్స్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. బిహార్ మెకానిక్ అరెస్ట్
ఈసారి చేపట్టబోయే నిరసనలను బాధితులే ముందుండి నడిపిస్తారని సీజేపీ వెల్లడించింది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా తమ పిల్లలను, వారి భవిష్యత్తును కోల్పోయిన కుటుంబాలు, అలాగే పోలీసుల దౌర్జన్యాలకు గురైన బాధితులు స్వయంగా ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తారని పార్టీ తెలిపింది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
Also Read: ఒకే వారం ఏకంగా 4 మలయాళ సినిమాలు… థ్రిల్లర్స్ నుండి హారర్ వరకు ఫుల్ వినోదం