PM Modi On Mamatha: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బెంగాల్ ప్రభుత్వం అవమానించడం సిగ్గుచేటుని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఈ విషయంలో బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందన్నారు. అసలు బెంగాల్‌లో ఏం జరిగింది?
బెంగాల్ ప్రభుత్వం హద్దులు దాటేసింది-ప్రధాని మోదీ
బెంగాల్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న వేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకోకుండా మార్చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తప్పుపట్టారు.. ఆపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు సీఎం మమతా బెనర్జీ, మంత్రివర్గ సభ్యులు కూడా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
రాష్ట్రపతి పదవి అనేది రాజకీయాలకు అతీతమని గుర్తుచేశారు. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని రాసుకొచ్చారు. బెంగాల్ ప్రభుత్వం అన్ని లిమిట్స్ క్రాస్ చేసిందన్నారు. సంతాల్ సంస్కృతిని సీఎం మమత బెనర్జీ అవమానించారని ప్రస్తావించారు. బెంగాల్ ప్రభుత్వ చర్యతో గిరిజనుల మనోభావాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
బెంగాల్ టూర్‌లో రాష్ట్రపతికి అవమానం.. ప్రోటోకాల్ పాటించని బెంగాల్ ప్రభుత్వం
గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము ఆవేదన గమనించిన ప్రజల హృదయాలు బాధతో నిండిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కించపరిచారని, దీనికి బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బెంగాల్ ప్రభుత్వానికి ఇకనైనా మంచి బుద్ది కలుగుతుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.
దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వం తీరు ప్రెసిడెంట్‌ని అవమానించేలా ఉందన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమన్నారు. ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాలన్నారు. రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతమని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
ALSO READ: అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, 8 గ్రాముల బంగారం, టీవీకే విజయ్ మేనిఫెస్టో
అంతర్జాతీయ ఆదివాసీ సదస్సు కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము డార్జిలింగ్ వెళ్లారు. అయితే ఆ సదస్సుకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చివరకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రెసిడెంట్‌కు సీఎం, మంత్రుల నుంచి అధికారిక స్వాగతం లభించలేదు. బెంగాల్‌లో ప్రోటోకాల్ పాటించకపోవడంతో మమతా ప్రభుత్వంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
రాష్ట్రపతి పర్యటన సమయంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు: ప్రధాని మోదీ
బెంగాల్ ప్రభుత్వం అన్ని లిమిట్స్ క్రాస్ చేసింది
సంతాల్ సంస్కృతిని మమత బెనర్జీ అవమానించారు
రాష్ట్రపతి పదవి రాజకీయాలకన్నా ఉన్నతమైనది
రాష్ట్రపతి పదవిని గౌరవించాలి
– ప్రధాని మోదీ
During… https://t.co/9taXoZzu0z pic.twitter.com/yZXSkh4HAk
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2026
రాష్ట్రపతి విషయంలో బెంగాల్ సర్కార్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందన
బెంగాల్ ప్రభుత్వం తీరు ప్రెసిడెంట్ ని అవమానించేలా ఉంది
ఇది నిజంగా చాలా బాధాకరం
ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాలన్న చంద్రబాబు నాయుడు
రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతమన్న సీఎం… https://t.co/9taXoZzu0z pic.twitter.com/Mfy6hj8jOa
— BIG TV Breaking News (@bigtvtelugu) March 8, 2026