BigTV English

Lok Sabha Speaker: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..

Lok Sabha Speaker: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..

Lok Sabha Speaker: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి పదవులిచ్చి మిత్రపక్షాలలో అసంతృప్తులు లేకుండా బీజేపీ జాగ్రత్తపడింది. కానీ లోక్ సభ స్పీకర్ పదవిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తమకు స్పీకర్ పదవి కేటాయించాలని పట్టుబట్టింది. ఇక తామేం తక్కువకాదన్నట్టు జేడీయూ కూడా స్పీకర్ పదవిపై కన్నేసింది.


బీజేపీకి తలనొప్పులు తప్పవు అనుకునే సమయానికి జేడీయూ స్పీకర్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం జేడీయూ స్పోక్స్ పర్సన్ కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలే. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసిన వ్యక్తికి తాము మద్దతు ఇస్తామని కేసీ త్యాగి చెప్పారు. దీంతో స్పీకర్ రేసు నుంచి జేడీయూ అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

లోక్‌సభ స్పీకర్‌పై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ.. “టీడీపీ, జేడీయూ ఎన్డీఏతో ఉన్నాయి. బీజేపీ నామినేట్ చేసిన వారికి మద్దతిస్తాం..’’ అని అన్నారు. ఓ ఇంటర్వూలో స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి కట్టబెడతారా అనే ప్రశ్నకు త్యాగి జవాబిచ్చారు. స్పీకర్ పదవి ఎప్పుడూ పాలక పక్షానిదేనని.. వారికి ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి వారికి కట్టబెట్టడమే కరెక్ట్ అని త్యాగి అన్నారు.


ఇదిలా ఉండగా టీడీపీ మాత్రం స్పీకర్ పదవిపై పట్టువిడవడం లేదని తెలుస్తోంది. కేంద్రంలో చక్రం తిప్పాలంటే స్పీకర్ పదవి చాలా కీలకం మని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం బాబుకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. అందుకు ఉదాహరణ 1999 కేంద్రంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ఓటింగ్.. అప్పటి ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి టీడీపీ స్పీకర్ జీఎంసీ బాలయోగీ తీసుకున్న నిర్ణయమేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: వాజ్‌పేయ్ గవర్నమెంట్ పడిపోడానికి కారణమేంటో తెలుసా..? మరోసారి మోదీ ఆ సాహసం చేస్తారా?

దీంతో బీజేపీ ప్రస్తుతం స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు సాహసం చేయడంలేదని చర్చ నడుస్తోంది. దీంతో స్పీకర్ పోరులో టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ తప్పదనే అంటున్నారు విశ్లేషకులు.

కాగా జూన్ 26న లోక్‌సభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనుంది. 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 24న తొలిసారిగా ప్రారంభమయ్యి జూలై 3న ముగుస్తాయి.

Related News

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×