BigTV English

Prakash Raj : ఇన్ని రోజులు సైలెంట్.. ఇప్పుడు మోదీపై సెటైర్లు..

Prakash Raj : ఇన్ని రోజులు సైలెంట్.. ఇప్పుడు మోదీపై సెటైర్లు..

Prakash Raj : ఆ ప్రకాశ్ రాజ్ ఉన్నారే. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఫక్తు సెక్యులరిస్టు అనిపించుకుంటారు. మోదీ, పవన్ కల్యాణ్‌లను తరచూ గిల్లుతుంటాడు. వాళ్లు ఏది మాట్లాడినా, ఏది చేసినా.. ఏదో ఒకటి తప్పు పడుతుంటారు. నవ్వితే నవ్వారని అంటారు. నవ్వక పోతే నవ్వలేదని విమర్శిస్తారు. అలా నిత్య అసంతృప్తి వాదిగా ముద్ర పడ్డారు ప్రకాశ్ రాజ్. నటుడిగా ఆయన విషయంలో నో కాంట్రవర్సీ. కానీ, మాటలు, థాట్ ప్రాసెస్‌లోనే చాలా తేడా మనిషి..అంటారు. అలాంటి ప్రకాశ్ రాజ్ మరోసారి ప్రధాని మోదీపై నోరు పారేసుకున్నారు.


ఇన్నాళ్లూ మౌనంగా ఉండి..

ఆపరేషన్ సిందూర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది ఇండియా. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో త్రివిధ దళాలు పాక్‌పై విరుచుకుపడ్డాయి. ఉగ్ర స్థావరాలను, ఆర్మీ కేంద్రాలను, ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేశాయి. ఎదురుదాడికి ప్రయత్నించిన పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించాయి. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సిందూర్‌తో చాటిచెప్పారు ప్రధాని మోదీ. ఇంత జరుగుతుంటే ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఆపరేషన్ సిందూర్‌కు ఆయనేమీ మద్దతు తెలపలేదు. ఇండియన్ ఆర్మీకి జేజేలు పలకలేదు. పాకిస్తాన్‌ను తప్పు బట్టలేదు. ఉగ్రవాదాన్ని ఖండించనూ లేదు. నథింగ్ ఈజ్ బెటర్ దాని నాన్‌సెన్స్.. అన్నట్టు ఇన్నాళ్లూ ఆయన సైలెంట్‌గా ఉండటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని అంటారు. కానీ…..


మోదీయే టార్గెట్‌గా..

అంతా అయిపోయాక, ఇండియా పాక్ యుద్ధం ముగిశాక.. ప్రకాశ్ రాజ్ మళ్లీ ప్రధాని మోదీని గెలకడం స్టార్ట్ చేశారు. ప్రచార్ మంత్రి అంటూ మొదలుపెట్టారు. ఇమేజ్ పెంచుకోవడం కోసం ఏదైనా చేస్తారు అంటూ మోదీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కాంట్రవర్సీ పోస్ట్ పెట్టారు. వాట్ యువర్ కామెంట్స్ డియర్ సిటిజెన్స్ అంటూ.. నెటిజన్లను రెచ్చగొట్టారు. ఎప్పటిలానే జస్ట్ ఆస్కింగ్ అని మళ్లీ కుంపటి రాజేశారు. పులి తోలు ఆరేసి ఉన్న చోట ఓ నక్క తిరుగుతున్న ఫోటోను పోస్ట్ చేసి మరింత కలకలం క్రియేట్ చేశారు.

Also Read : అణుబాంబు పేలితే ఎట్టా ఉంటాదో తెలుసా?

ప్రకాశ్ రాజ్ ఇక మారరా?

మంగళవారం పంజాబ్‌లోని అదంపూర్‌ ఎయిర్ బేస్‌ను సందర్శించారు ప్రధాని మోదీ. ఈ బేస్‌నే పాకిస్తాన్ సైన్యం టార్గెట్‌గా చేసుకుని దాడులు చేయగా, మన ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సైనికులను కలిసి వారికి మద్దతు ప్రకటించారు మోదీ. వారిలో మరింత ధైర్యం నింపారు. వారి పరాక్రమాన్ని కొనియాడారు. గంటన్నరపాటు జవాన్లతోనే గడిపారు ప్రధాని. మోదీ టూర్‌ను టార్గెట్‌గా చేసుకుని.. ఐ థింక్, ప్రచార్ మంత్రి విల్ ట్రేడ్ ఎనీథింగ్ ఫర్ ఇమేజ్ బిల్డింగ్.. అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన పోస్ట్ కాంట్రవర్సీగా మారింది. సమయం, సందర్భం లేకుండా ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీడు మారడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 100 మంది ఉగ్రవాదులను హతమార్చి.. శత్రుదేశం పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించాక కూడా.. మోదీని ప్రచార్ మంత్రి అంటూ.. ఇమేజ్ కోసం అంటూ.. ఇలా సూటిపోటి మాటలు మాట్లాడటంపై ప్రకాశ్ రాజ్‌పై రగిలిపోతున్నారు నెటిజన్లు.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×