BigTV English

Nuclear Weapons : ఒక్క అణుబాంబు.. లక్షల్లో మరణాలు.. జపాన్‌లో అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

Nuclear Weapons : ఒక్క అణుబాంబు.. లక్షల్లో మరణాలు.. జపాన్‌లో అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

Nuclear Weapons : ఇండియా పాకిస్తాన్ యుద్ధం అర్థాంతరంగా ముగిసింది. వార్‌కు ది ఎండ్ పడటంతో చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ, యుద్ధాన్ని సడెన్‌గా ముగించడానికి పాక్ అణ్వాయుధాలు డ్యామేజ్ అవడమే మెయిన్ రీజన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అది నిజమే అయితే, పాకిస్తాన్‌లోని కిరాక్ హిల్స్ భూగర్భంలో దాచిన అణ్వస్త్రాలు దెబ్బతిని, రేడియేషన్ లీక్ అవుతుంటే మాత్రం అది పెను ముప్పుకు దారి తీస్తుంది. అందుకే, రెండు దేశాలు అసలేమాత్రం ఆలోచించకుండా వెంటనే వార్‌ను ఆపేశాయని అంటున్నారు. అణు యుద్ధమే జరిగితే ఆ పరిణామాలు మామూలుగా ఉండవు మరి. గతంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన ‘లిటిల్ బాయ్’, ‘ఫ్యాట్ మ్యాన్’ ఆటంబాంబుల ఇంపాక్ట్ దశాబ్దాల తరబడి ఆ దేశాన్ని తల్లడిల్లేలా చేసింది. జపాన్ కాబట్టి ఆ అణు గాయం నుంచి కోరుకుంది కానీ.. వేరే దేశమైతే ప్రపంచపటం నుంచి చెదిరిపోయేది. ఇంతకీ అణుబాంబులు ఎందుకంత డేంజర్? అవి పేలితే ఏమవుతుంది? ఎంత డ్యామేజ్ జరుగుతుంది? జపాన్‌లో అసలేం జరిగింది?


హిరోషిమా, నాగసాకిలో ఏం జరిగిందంటే..

1945, ఆగస్టు 6. జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా “లిటిల్ బాయ్” అనే కోడ్‌నేమ్ ఉన్న 15 కిలోటన్నుల అణుబాంబును ప్రయోగించింది. మూడు రోజుల తర్వాత ఆగస్టు 9న, 21 కిలోటన్నుల బరువున్న ఆటంబాంబు “ఫ్యాట్ మ్యాన్” నాగసాకిని ఢీకొట్టింది. ఇక అంతే. ఆ రెండు నగరాలు సర్వనాశనం. శవాల దిబ్బగా, బూడిద కుప్పలుగా మారాయి. యావత్ ప్రపంచం బిత్తరపోయింది. అదే మొదలు.. అదే ఆఖరు. అణ్వాయుధాలను మరోసారి ఉపయోగించే సందర్భం ఏ దేశానికీ రాలేదు. ఆ సాహసం ఎవరూ చేయలేనంతగా దుష్పరిణామాలు చవిచూశారు.


జపాన్‌లో 2 లక్షల మంది మరణం

హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడుల ఫలితంగా సుమారు 2 లక్షల మంది మరణించారని అంచనా. కొందరు బాంబు తీవ్రతకు వెంటనే చనిపోతే.. రేడియేషన్ ఎఫెక్ట్‌కు ఆ తర్వాత చనిపోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. అనారోగ్యం, దీర్ఘకాల సమస్యలు, అంగవైకల్యంతో జీవచ్చవాళ్లా చచ్చిబతికిన వాళ్లు లక్షల్లోనే ఉంటారు.

లిటిల్ బాయ్ ఎఫెక్ట్

లిటిల్ బాయ్ బాంబు హిరోషిమా నగరానికి 600 మీటర్ల ఎత్తులో పేలింది. దాని ప్రభావంతో దాదాపు 80,000 మంది తక్షణమే మరణించారు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రతీదాన్ని నేలమట్టం చేసింది. 90 శాతం భవనాలను నాశనం చేసింది. థర్మల్ రేడియేషన్ ప్రభావంతో నగరమంతా మంటలు చెలరేగాయి. ప్రాణులకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఆ ఏడాది చివరి నాటికి కాలిన గాయాలు, రేడియేషన్ వల్ల వచ్చిన అనారోగ్యంతో హిరోషిమా నగరంలో మృతుల సంఖ్య 1,40,000 దాటేసింది.

ఫ్యాట్ మ్యాన్ డ్యామేజ్

ఫ్యాట్ మ్యాన్ అణుబాంబు తాకిడికి నాగసాకిలో తక్షణమే 40,000 మంది చనిపోయారు. 1945 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 74,000కు పెరిగింది. 14,000 ఇళ్లు కాలిపోయాయి. నగరానికి ఓ వైపుగా కొండ ఉండటంతో పేలుగు పరిధి కాస్త తగ్గింది. విధ్వంసం మాత్రం వినాశకరంగానే ఉంది.

ఆ నగరాలు స్మాష్

ఆ రెండు అణుబాంబుల ప్రభావం హిరోషిమా, నాగసాకిలపై దీర్ఘకాలికంగా తీవ్ర పరిణామాలను చూపించింది. ప్రాణాలతో బయటపడినవారు రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల లుకేమియాలాంటి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ ప్రాంత ప్రజల్లో జన్యు ఉత్పరివర్తనాలూ సంభవించాయి. భవిష్యత్ తరాలపైనా ప్రభావితం చూపాయి. చాలామందిలో పుట్టుకతో వచ్చే లోపాలు కనిపించాయి. అంటే రెండు తరాలపై ఆటంబాబులు దుష్ప్రభావం చూపించాయి. హిరోషిమాలోని నదులు, నేల కలుషితమయ్యాయి. వృక్షసంపద తుడిచిపెట్టుకు పోయింది. ఆ రెండు నగరాలు నామరూపాలు లేకుండా పోవడంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది.

పాక్‌లో డేంజర్ బెల్స్!

అంతటి వినాశనంలోనూ.. జపాన్ ప్రజలు ఆ రెండు నగరాలను సంకల్ప బలంతో పునర్నిర్మించుకున్నారు. అంతర్జాతీయ సహాయం వారికి తోడైంది. హిరోషిమా శాంతికి చిహ్నంగా మారింది. అక్క ఏర్పాటు చేసిన పీస్ మెమోరియల్ పార్క్.. ఆనాటి అణుయుద్ధం యొక్క భయానకతకు నిదర్శనంగా నిలిచింది. అందుకే, ఆటంబాంబు అంటే.. అప్పడూ ఇప్పుడు యావత్ ప్రపంచం వణికిపోతుంటుంది. అలాంటిది ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అణ్వాస్త్రాల ప్రయోగం జరిగితే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించ తరం కాదు. పాక్‌పై భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి ధాటికి అక్కడ సమీపంలోని కిరాక్ కొండల్లో దాచిన అణ్వాయుధాలు దెబ్బతిన్నాయనే అనుమానం ఉంది. ఆ ప్రాంతంనుంచి రేడియేషన్ లీక్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. అమెరికా, టర్కీ విమానాలు ఆ రేడియేషన్ గుర్తుంచే ప్రయత్నం చేశాయని అంటున్నాయి.

ఇండియా పాక్ టెన్షన్

భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధ దేశాలే. ఒక్కో బాంబు 15 నుంచి 100 కిలోటన్నుల బరువు ఉండొచ్చని అంటున్నారు. జపాన్‌పై వేసిన 15-20 కిలోటన్నుల ఆటంబాంబులతోనే అంత విధ్వంసం జరిగితే.. ఇక 100 టన్నుల బరువైన అణుబాంబులను భారత్ కానీ, పాకిస్తాన్ కానీ ప్రయోగించి ఉంటే..? అసలే మన రెండు దేశాల్లో జనాభా ఎక్కువ. ఢిల్లీ, ముంబై కానీ.. కరాచీ, లాహోర్‌లపై కానీ ఆటంబాంబు పేలితే.. ఆ విధ్వంసం మామూలుగా ఉండదు. లక్షలాది మంది క్షణాల్లో శవాలుగా మారడం ఖాయం. హిరోషిమా, నాగసాకిలను మించి భయానక పరిస్థితులు సంభవిస్తాయి.

అణుబాంబు పేలితే జరిగేది ఇదే..

పేలుడు, వేడి, రేడియోధార్మికత వల్ల అణ్వాయుధాలు అసమానమైన విధ్వంసాన్ని విడుదల చేస్తాయి. పేలుడు దాటికి సూపర్‌సోనిక్ షాక్‌వేవ్‌ ఉత్పత్తి అవుతుంది. భవనాలు, ఫ్లైఓవర్లులాంటి మౌలిక సదుపాయాలను కూల్చివేస్తుంది. అణుబాంబు పేలిన చోట.. మిలియన్ల డిగ్రీల కంటే ఎక్కువ వేడి పుట్టి మంటలు వ్యాపిస్తాయి. ఆ వేడి తాకిడి తీవ్రమైన కాలిన గాయాలకు కారణమవుతుంది. మండే స్వభావం ఉన్న పదార్థాలు బ్లాస్ట్ అవుతాయి. అగ్ని తుఫానులను సృష్టిస్తాయి అణుబాంబులు. పేలుడు తీవ్రత విద్యుత్ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఆధునిక మౌలిక సదుపాయాలను స్తంభింపజేస్తుంది.

రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..

రేడియేషన్ ప్రభావంతో అంతర్గత రక్తస్రావం జరిగి రోజులు, వారాల గ్యాప్‌లో చాలామందిని చంపేస్తుంది. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలకు కారణమవుతుంది. విస్తారమైన ప్రాంతాలలో వ్యాపించిన రేడియోధార్మిక కణాలు.. నేల, నీరు, గాలిని కలుషితం చేస్తాయి, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రమాదాలను కలిగిస్తాయి.

Also Read : కిరాక్ కొండల్లో దాగున్న కిటుకేంటి? పాక్ భయమేంటి?

పాక్‌లో ఆ బాంబు లీక్ అయిందా?

ఇంతటి విధ్వంసం జరుగుతుంది కాబట్టే.. అణుబాంబు అంటే అంతా వణికిపోతారు. పాపిష్టి పాకిస్తాన్ చేతిలోనూ ఆటంబాబులు ఉండటం దురదృష్టకరం. అయితే, పాక్‌లోని ఆ ఆయుధ నిల్వలు డ్యామేజ్ అయి, రేడియేషన్ లీక్ అవుతోందనే ప్రచారం ఆ దేశాన్ని కంగారెత్తిస్తోంది. వెంటనే ఇండియా పాక్ యుద్ధం ఆగి ఉండకపోతే.. ఆ బాంబులు పేలి ఉంటే..? వామ్మో…

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×