E-Paper
Advertisement

Republic Day : ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ముఖ్య అతిధిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు..

Republic Day : దేశ వ్యాప్తంగా 75వ రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Republic Day : ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ముఖ్య అతిధిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు..
Advertisement

Republic Day : దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్రమంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు.

జాతీయ వార్‌ మెమోరియల్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో జెండా ఆవిష్కరించే వేదిక వద్దకు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల్లో దాదాపు 40ఏళ్ల తర్వాత రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సైనికులు నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Advertisement

ఈ సారి వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం అధికశాతం మహిలకు ప్రాధన్యత కల్పించింది. వేడుకల్లో మహిళలు తమ ప్రతిభను చాటారు. ఈ ఏడాది రిప్లబిక్ థీమ్‌ను జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. సైనికులు ప్రదర్శనలో భాగంగా దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతోపాటు క్షిపణులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ప్రదర్శనలో పాల్గోన్నాయి.

ఈ వేడుకల్లో ముఖ్యంగా తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు పరేడ్‌లో నేతృత్వం వహించారు. ఈసారి పరేడ్‌లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్‌ దళం కూడా పాల్గొంది. పరేడ్‌లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని పాడారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా నాదస్వరం, శంఖం, నగారా వినియోగించారు.

Advertisement

15 మంది మహిళా ఫైలట్లు వాయు సేన విన్యాసాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో 260 మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలను ప్రదర్శించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శకటాలు ఉన్నాయి. వీటితోపాటు సామాజిక-ఆర్థిక కార్యకలాపాలతోపాటు శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలకు చెందిన 10 శకటాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 500 మంది గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు రిపబ్లిక్‌ డే వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు. వీరంతా గత ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకున్న ప్రజాప్రతినిధులు కావడం విశేషం.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×