R.K.Roja: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి చాలా మంచి అభినవభావ సంబంధం ఉంది. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన వారు రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా ఉన్నత పదవులు తీసుకున్నారు. ముఖ్యమంత్రిలుగా కూడా పాలించిన వారు ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి మంచి సక్సెస్ అందుకొని రాజకీయాలలో కూడా ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారిలో సీనియర్ నటి రోజా(Roja) కూడా ఒకరు. ఈమె రాజకీయాలలోకి వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టారు.
ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈమె ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా రాజకీయాల గురించి ప్రస్తావనకు రావడంతో జగనన్న(Jagan) తనకు దేవుడు ఇచ్చిన అన్న అని తెలిపారు. తన పట్ల ఎప్పుడు ఎంతో ప్రేమ ఆప్యాయతలను చూపిస్తూ ఉంటారని తెలిపారు. జగనన్న నాకు ఏదైనా ఒక పని ఇచ్చారు అంటే అది చాలా పర్ఫెక్ట్ గా చేస్తాననే నమ్మకం అన్నకు ఉంది. నేనంటే నచ్చని వాళ్ళు నా గురించి ఆయన వద్ద ఏదైనా చెప్పాలని చూసిన ఆ విషయం నేను చూసుకుంటా అంటూ అక్కడే కట్ చేస్తారు అలాంటి గౌరవాన్ని నేను జగనన్న దగ్గర పెట్టుకున్నానని రోజా తెలిపారు.
ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాపిడ్ ఫెయిర్ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మాత్రం రోజా జగన్ పేరు చెప్పకపోవడం గమనార్హం. ఇలా జగన్ పేరు కాకుండా ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి పేరు కూడా చెప్పలేదు. మరి రోజా ఫేవరెట్ పొలిటిషన్ ఎవరు అంటే వెంటనే ఈమె దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) గారు అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. నేను ఎన్నికలలో నామినేషన్ వేసే ముందు అమ్మ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఉంటే వెళ్లి తన ఆశీర్వాదాలు తీసుకొని నామినేషన్ వేశానని తెలిపారు.
ఇలా రాజకీయాల పరంగా నాకు జయలలిత గారు అంటే చాలా ఇష్టమైన నాయకురాలని రోజా తెలిపారు. ఇకపోతే మేము మా పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి జయలలిత గారిని కలిసినప్పుడు ఆమె సెల్వ గారితో మాట్లాడుతూ.. 11 సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుంటున్నావు తనని బాగా చూసుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా జయలలిత గారు, శ్రీవాణి గారు సెల్వ గారికి వార్నింగ్ ఇవ్వడంతో అదేంటి నేను కూడా నిన్ను 11 సంవత్సరాల లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నాను కదా మరి వీరందరూ నాకే వార్నింగ్ ఇస్తున్నారు.. నీకు ఎవరు వార్నింగ్ ఇవ్వరా అంటూ మాట్లాడారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే రోజా మాత్రం తన ఫేవరెట్ పొలిటీషియన్ జగన్ కాకుండా జయలలిత పేరు చెప్పడంతో వైసీపీ అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు. ఇక జయలలిత గారు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు.
Also Read: డైరెక్టర్ సెల్వాతో రోజా లవ్..చిరంజీవి అంత మాట అన్నారా?