E-Paper
Advertisement

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ కోసం కయాదు లోహర్ కొత్త స్ట్రాటజీ.. ఫొటోస్ వైరల్!

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ కోసం కయాదు లోహర్ కొత్త స్ట్రాటజీ.. ఫొటోస్ వైరల్!
Advertisement

Kayadu Lohar: అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కయాదూలోహర్ డ్రాగన్ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సొంతం చచేసుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఫంకీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక తర్వాత హృదయం మురళి సినిమాలో నటించి, మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 kayadu Lohar starting new way to the Paradise promotion
kayadu Lohar starting new way to the Paradise promotion (Image credit: Instagram)

సెప్టెంబర్ 24వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. చిత్ర బృందం వేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా కయాదు లోహర్ కనిపించకపోవడం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

kayadu Lohar starting new way to the Paradise promotion
kayadu Lohar starting new way to the Paradise promotion (Image credit: Instagram)
Advertisement

ఇదే విషయంపై ప్రమోషన్స్ లో ఒక రిపోర్టర్ హీరో నానిని ప్రశ్నించగా.. నాని మాట్లాడుతూ..” కయాదు ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉన్నారు. నిజం చెప్పాలి అంటే అక్కడి షూటింగ్ ను ఆపేసి, ఆమెను మా మూవీ ప్రెస్ మీట్ కి పంపించడానికి మారి సెల్వరాజ్ ఒప్పుకోలేదంటూ సరదాగా కామెంట్ చేశారు నాని.

kayadu Lohar starting new way to the Paradise promotion
kayadu Lohar starting new way to the Paradise promotion (Image credit: Instagram)

దీంతో ఒకవైపు తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో.. ఆమె ప్రమోషన్స్ కి హాజరు కాకపోవడంతో పలు రకాల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఆడియన్స్ కి చేరువవుతూ తమ సినిమాను ఇన్ డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తూ కొత్త స్ట్రాటజీ ఫాలో అప్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

kayadu Lohar starting new way to the Paradise promotion
kayadu Lohar starting new way to the Paradise promotion (Image credit: Instagram)
Advertisement

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానుల హృదయాలను దోచుకుంది. లగ్జరీ లేబుల్ రుక్మిణి అటేలియర్ డిజైన్ చేసిన మృదువైన ఐవరీ జార్జెట్ ప్యాలెట్ కలిగి ఉన్న ఒక ట్రెండీ మోనో క్రోమోటిక్ ఇండో వెస్ట్రన్ కోఆర్డ్ సెట్ ధరించింది. దీనికి కాంబినేషన్లో లోతైన డీప్ వీ నెక్ కలిగిన క్రాప్డ్ బ్రాలెట్ బ్లౌజ్ ధరించింది. ఈ బ్లౌజ్ కి ప్లేటెడ్ బిషప్ బెలూన్ స్లీవ్స్ , నడుము వద్ద ప్రత్యేకమైన లేయర్డ్ కటౌట్ స్ట్రాపీ బాండ్ జోడించారు. నేలకు తాకేలా పొడవాటి దుపట్టాను జోడించారు. అలాగే సెలబ్రిటీ స్టైలిస్ట్ ఇనాజ్ ఫర్హాన్ డిజైన్ చేసిన జువెలరీ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. మొత్తానికైతే సెగలు పుట్టిస్తూ ది ప్యారడైజ్ సినిమాను ఈ విధంగా ప్రమోట్ చేసింది ఈ అమ్మడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

kayadu Lohar starting new way to the Paradise promotion
kayadu Lohar starting new way to the Paradise promotion (Image credit: Instagram)

Related News

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!

విడాకుల వ్యవహారంపై స్పందించిన నీతి టేలర్.. అంత మాట అన్నారేంటి?

రోజాకు ఇష్టమైన పొలిటీషియన్ తనేనా.. జగన్ కాదా? ఇదేమీ ట్విస్ట్ రా బాబు!

‘ఇంత ఖాళీగా ఉన్నారా?’.. ట్రోలర్స్‌పై తనూజ ఫైర్

డైరెక్టర్ సెల్వాతో రోజా లవ్..చిరంజీవి అంత మాట అన్నారా?

బాడీ షేమింగ్ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కత్రినా కైఫ్!

Big Stories

Advertisement
×