E-Paper
Advertisement

బిగ్ టీవీ ఇంపాక్ట్.. గుంతల వ్యవహారంలో సర్కార్ యాక్షన్.. మెట్రోకు నోటీసులు జారీ!

బిగ్ టీవీ ఇంపాక్ట్.. గుంతల వ్యవహారంలో సర్కార్ యాక్షన్.. మెట్రోకు నోటీసులు జారీ!
Advertisement

Hyderabad Metro: సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో మెట్రో పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్విన వ్యవహారంపై ప్రభుత్వ యంత్రాగం స్పందించింది. ఈ అంశంపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు నోటీసులు పంపింది. అయితే ఈ తవ్వకాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. ఇది పూర్తిగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలని స్పష్టం చేసింది. పనులకు తమ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ బిగ్ టీవీకి లైవ్ లో తెలిపారు.

Also Read: Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!

Advertisement

బిగ్ టీవీ రిపోర్టర్ సుజాత స్వయంగా మల్కాజిగిరి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కు లైవ్ లో కాల్ చేశారు. ఈ సందర్భంగా సదరు అధికారి మాట్లాడుతూ ఆ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని పునరుద్ఘటించారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని మెట్రోకు నోటీసులు సైతం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తవ్వకాలకు పూర్తి బాధ్యత మెట్రోదేనని స్పష్టం చేశారు. అయితే ఇది నేరుగా మెట్రో ఆధ్వర్యంలో జరిగిందా? లేదా కాంట్రక్టర్ చేశారా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. దీనిపై క్లారిటీ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు.

Advertisement

Also Read: దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Tags

Related News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌

మహిళను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన హోంగార్డ్‌.. ఉద్యోగం నుంచి తొలగింపు

అవినీతి మరక లేని పాలన మోదీకే సాధ్యం.. రోజ్ గార్ మేళాలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్, BRS నైజం! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

బిగ్ టీవీ దెబ్బకు మెట్రో కాంట్రాక్టర్లలో వణుకు.. రాత్రికి రాత్రి ఆగమేఘాలపై పిల్లర్ల గుంతలు పూడ్చివేత!

దుండిగల్‌లో 425 కిలోల గంజాయి సీజ్.. ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్!

ఢిల్లీ వేదికగా తెలంగాణ బిగ్ స్టెప్.. 3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా భట్టి మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×