Katrina Kaif:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతుంది . అంతేకాదు ఉండాల్సిన విషయాలకు విరుద్ధంగా ఉంటే మాత్రం విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసవానంతరం పెరిగిన బరువుపై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు , బాడీ షేమింగ్ చర్చలపై ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) తనదైన శైలిలో స్పందించి ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.
కత్రినా కైఫ్ బరువు పెరిగిపోవడంతో సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ గుప్పిస్తున్న నేపథ్యంలో నేరుగా స్పందించింది. నా దృష్టిలో నిజమైన అందం అంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండడమే.. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కఠినమైన అందాల కొలతలను, నియమాలను నేను అనుసరించినప్పటికీ.. అనుభవంతో అందంపై నా దృక్పథం పూర్తిగా మార్చుకున్నాను. శారీరక దృఢత్వాన్ని కాపాడుకుంటూ.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే. అత్యంత ప్రాధాన్యమైన అంశం బయటకు కనిపించే రూపం కంటే వ్యక్తిగత ఆత్మవిశ్వాసమే నిజమైన సౌందర్యం అంటూ తన మాటలుగా చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.
భారీగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ నిందలను ఖండిస్తూ.. పలువురు ప్రముఖ సినీ ప్రముఖులు వరుసగా మద్దతు నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకురాలు, సినీనటి మాధవీ లత స్పందిస్తూ.. మీ ఇంట్లో ఆడవాళ్లను కూడా పిల్లలు పుట్టాక బరువు పెరిగితే వాళ్ళని వదిలేసి, మరో పెళ్లి చేసుకుంటారా? అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రముఖ రాజకీయ నాయకురాలు, సినీ నటి కుష్బూ కూడా స్పందించింది. “ప్రసవానంతరం మహిళల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు రావడం సహజమైన ప్రక్రియ. మహిళల శారీరక మార్పులను అర్థం చేసుకోకుండా హేళన చేయడం సరికాదు. గతంలో నేను కూడా ఇలాంటి ఎన్నో బాడీ షేమింగ్ విమర్శలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా మహిళలు ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా తమను తామ ప్రేమించుకోవడమే బాడీ షేమింగ్ ట్రోల్స్ చేసే వారికి ఇచ్చే సరైన సమాధానం” అంటూ ఆమె స్పష్టం చేశారు. ఇకపోతే 2025 నవంబర్ లో ఈమె పండంటి బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబు అనంతరం బరువు పెరిగిపోయి మీడియా ముందుకు తక్కువగా దర్శనమిస్తోంది.
ALSO READ:నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఇరుముడి.. వీడియో వైరల్!
ఇకపోతే ఉన్నట్టుండి కత్రినా కైఫ్ పై ఇలా విమర్శలు రావడానికి అసలు కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. 2026 గణేష్ చతుర్థి వేడుకలను ప్రముఖ వ్యాపార దిగ్గజం అంబానీ ఇంట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా విచ్చేసి సందడి చేసిన విషయం తెలిసిందే. అందులో కత్రినా కైఫ్ కూడా తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందులో ఆమె చాలా చబ్బిగా , బొద్దుగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆమె బరువు పెరిగిందని, చాలా లావు అయిందని ఇలా రకరకాల ట్రోల్స్ గుప్పించారు.