E-Paper
Advertisement

Rahul Gandhi : భారత్ న్యాయయాత్ర.. మణిపూర్ టూ ముంబై..

Rahul Gandhi : భారత్ న్యాయయాత్ర.. మణిపూర్ టూ ముంబై..
Advertisement

Rahul Gandhi : భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చుట్టేసిన రాహుల్ గాంధీ.. రెండో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ భారత్‌ న్యాయయాత్ర పేరుతో ఈ యాత్ర చేపట్టనున్నారు. భారత్ జోడోయాత్రకు కొనసాగింపుగా జరిగే ఈ యాత్రను మణిపూర్ లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రను ముంబైలో ముగిస్తారు.

జనవరి 14 నుంచి మార్చి 20 వరకు భారత్ న్యాయయాత్ర సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో రాహుల్ బస్సు ద్వారా యాత్ర చేస్తారు. మరికొన్న చోట్ల కాలినడకన యాత్ర జరగనుంది. 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. మణిపూర్‌ నుంచి మొదలయ్యే రాహుల్ గాంధీ యాత్ర.. నాగాలాండ్‌, అస్సోమ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల మీదుగా సాగుతోంది. చివరికి మహారాష్ట్రకు చేరుకుంటుంది.

Advertisement

మణిపూర్‌ నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కిలోమీటర్ల ఈ యాత్ర సాగనుంది. భారత దేశంలో తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం వరకు యాత్ర చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. దీంతో రాహుల్ గాంధీ యాత్ర చేసేందుకు సన్నద్ధమయ్యారు.

గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్‌ గాంధీ.. భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర.. 5 నెలలపాటు సాగింది. మొత్తం 4,500 కిలోమీటర్లు సాగింది. మొత్తం 136 రోజులపాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా కశ్మీర్‌ చేరుకున్నారు. 2023 జనవరి 30న లాల్‌చౌక్‌లో భారత్ జోడో యాత్రను ముగించారు. అక్కడ జాతీయ జెండా ఎగురవేశారు.

Advertisement

రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేసిన సమయంలో వివిధ రంగాల ప్రముఖులతో ఆయనతో కలిసి కొందదూరం నడిచారు. అప్పుడు దక్షిణ భారత్‌ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్. ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.

Related News

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Big Stories

Advertisement
×