E-Paper
Advertisement

Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికలు.. రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి..?

Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికలు..  రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి..?
Advertisement

Rahul Gandhi : వచ్చే సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనే అంచనాలున్నాయి. 26 విపక్షాలు పార్టీ కలిసి కూటమిగా ఏర్పడటంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ ఇండియా కూటమి తరఫున బరిలోకి దిగుతారని ప్రకటించారు. ఈ విషయంపై ఇండియా కూటమిలో చర్చ జరిగిందని వివరించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ ను అన్ని పార్టీలు సమ్మతించాయని వెల్లడించారు.

విపక్ష కూటమి ఏర్పాటుపైనా అశోక్ గహ్లోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితులు అన్ని పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయని వివరించారు. అందువల్లే ఇండియా కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

బీజేపీ 31 శాతం ఓట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అశోక్ గహ్లోట్ వివరించారు. మిగిలిన 69 శాతం ప్రజలు మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. మోదీ 50 శాతం ఓట్లతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాశాన్ని వ్యక్తం చేశారని అది ఎప్పటికీ జరగదని గహ్లోట్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాని ఎన్నో హామీలచ్చారని కానీ ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలుసున్నారు.

ఇస్రో విజయాలకు గత ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ , ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని గెహ్లోట్ స్పష్టం చేశారు భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ సూచనతో నెహ్రూ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హయాంలోనే ఇస్రోగా నామకరణం చేశారని తెలిపారు . నెహ్రూ, ఇందిరాల కృషి ఫలితంగానే ప్రస్తుతం చంద్రయాన్‌- 3 లాంటి విజయాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు.

Tags

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×