E-Paper
Advertisement

Bus shelter : ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..

Bus shelter :  ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..
Advertisement

Bus shelter : విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని వైసీపీ ప్రభుత్వం కొంతకాలంగా పదే పదే ప్రకటనలు చేస్తోంది. నగరం నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ చాలా వేదికలపై ప్రకటనలు చేశారు. దసరాకు సీఎం వైజాగ్ కు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

విశాఖకు రాజధాని రూపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వంపై అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మోడ్రన్‌ బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ను రూ. 40 లక్షలతో నిర్మించింది. ఈ బస్‌షెల్టర్‌ను త్వరలో ప్రారంభించాల్సి ఉంది.

Advertisement

ఈ బస్ షెల్టర్ తాజాగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ ఖర్చుతో నిర్మించిన బస్ షెల్టర్ కుంగిపోవడంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. షెల్టర్‌ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్‌ వద్ద ఆందోళన చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×