BigTV English

Titan Submarine : ఇంకా దొరకని టైటాన్‌ ఆచూకీ.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో రెస్క్యూ ఆపరేషన్‌ ..

Titan Submarine : ఇంకా దొరకని టైటాన్‌ ఆచూకీ.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో రెస్క్యూ ఆపరేషన్‌ ..


Titan Submarine : ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ ఓడ సందర్శన కోసం వెళ్లి మిసైన జలాంతర్గామి టైటాన్‌ జాడ ఇంకా కనిపించలేదు. అందులో ఐదుగురు సందర్శకులు ఉన్నారు. వారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. టైటాన్ ఆచూకీ కోసం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

టైటాన్ ను గుర్తించేందుకు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి గాలిస్తున్నారు. సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వెలువడుతున్నాయని కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టింది. టైటాన్‌ గల్లంతైన ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకోసారి గట్టిగా శబ్దాలు వెలువడుతున్నాయని తెలుస్తోంది. ఈ శబ్దాలు టైటాన్‌ నుంచే వస్తున్నాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. టైటాన్‌లో కొంత ఆక్సిజన్ ఇంకా ఉందని భావిస్తున్నారు.


టైటాన్‌ ఆచూకీ కోసం జాన్‌ కాబోట్, స్కాండీ విన్‌ల్యాండ్, అట్లాంటక్‌ మెర్లిన్‌ అనే 3 బోట్స్ ను అమెరికా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్‌ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల అంటే 3.8 కిలోమీటర్ల లోతున ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ వరకు సురక్షితంగా చేరుకోవడం కష్టంగా భావిస్తున్నారు. అండర్‌వాటర్‌ రోబోను పంపించారని సమాచారం. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన 3 సి–17 రవాణా విమానాలను పంపించామని యూఎస్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు.

టైటాన్ కోసం పెట్రోలింగ్‌ విమానం, 2 ఓడలతో గాలింపు చర్యలు చేపట్టామని కెనడా సైన్యం తెలిపింది. గురువారం ఉదయానికే టైటాన్‌లో మొత్తం ఆక్సిజన్‌ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. దీంతో సందర్శకులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు. టైటాన్ జలాంతర్గామి ఆదివారం ఉదయం 6 గంటలకు టైటానిక్‌ దిశగా ప్రయాణం ప్రారంభించింది. అప్పటికి 4 రోజులకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే టైటాన్ లో ఉంది. దీనిలో 2 రకాల కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. నీటిలోకి వెళ్లిన 1.45 గంటలలోపే పనిచేయడంలేదు.

టైటాన్‌లో ఓషియన్‌గేట్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు స్టాక్‌టన్‌ రష్, బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమిష్‌ హర్డింగ్, ఫ్రెంచ్‌ నావికాదళం మాజీ అధికారి పాల్‌–హెన్రీ నార్జియోలెట్‌ పాకిస్థాన్ కు చెందిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్‌ దావూద్ ఉన్నారు. 1912లో అట్లాంటిక్‌ సముద్రంలో టైటానిక్‌ ఓడ మునిగిపోయింది. ఆ శిథిలాలను సందర్శించడానికి టైటాన్‌ జలాంతర్గామిలో సందర్శకులు బల్దేరారు. ఆదివారం రాత్రి అట్లాంటిక్‌ సముద్రంలో టైటాన్‌ గల్లంతైంది. కెనడా తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×