E-Paper
Advertisement

Shraddha Walkar : శ్రద్ధావాకర్ హత్య కేసు.. 3 వేల పేజీలతో ఛార్జిషీట్ సిద్ధం..

Shraddha Walkar : శ్రద్ధావాకర్ హత్య కేసు.. 3 వేల పేజీలతో ఛార్జిషీట్ సిద్ధం..
Advertisement

Shraddha Walkar : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యకేసులో విచారణ తుదిదశకు చేరుకుంది. అన్నికోణల్లో దర్యాప్తు చేప్టటిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. 3,000 పేజీల డ్రాఫ్ట్‌ ఛార్జిషీట్‌ను సిద్ధం చేశారు. ఫోరెన్సిక్‌, ఎలక్ట్రానిక్‌ ఆధారాలు, 100 మంది సాక్షుల వాంగ్మూలాలను అందులో పొందుపర్చారు. వీటి ఆధారంగా తుది ఛార్జిషీట్‌ను సిద్ధం చేయనున్నారు.

ఆఫ్తాబ్‌ అంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను ఛార్జిషీట్ కు జతచేయనున్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయనిపుణుల సమీక్షలో ఉంది. ఈ నెలాఖరు నాటికి ఛార్జిషీట్ ను న్యాయస్థానంలో దాఖలు చేసే అవకాశాలున్నాయి. అఫ్తాబ్‌ నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు దక్షిణ ఢిల్లీలోని పలు చోట్ల నుంచి 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. వాటి డీఎన్‌ఏలు కూడా శ్రద్ధా తండ్రి డీఎన్‌ఏతో సరిపోలాయి.

Advertisement

అఫ్తాబ్‌ ఎప్పటి నుంచో తన కుమార్తెను హింసించినా. పోలీసులు చర్యలు తీసుకోలేదని శ్రద్ధా తండ్రి వికాస్‌ ఇటీవల ఆరోపించారు. 2020లో శ్రద్ధా తొలిసారి ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శ్రద్ధా అదృశ్యంపై తాను మనిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించలేదని వికాస్‌ ఆరోపించారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాసి డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×