E-Paper
Advertisement

Swathi Maliwal Cried: కోర్టులో ఏడ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్!

Swathi Maliwal Cried: కోర్టులో ఏడ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్!
Advertisement

Swathi maliwal Cried in Court: ఆప్ ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే ఈకేసు విచారణ కోసం ఎంపీ స్వాతి మలివాల్ కోర్టుకు హాజరయ్యారు.

ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్నిరిజర్వ్‌లో పెట్టింది. అయితే పిటిషన్‌పై బిభవ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టులో కౌరవులు, ద్రౌపతి గురించి ప్రస్తావించారు. అయితే కోర్టు విచారణ సమయంలో స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. బిభవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లపై ఆమె అభ్యంతరం తెలిపారు. అనంతరం ఆమె బిభవ్‌పై ఐపీసీ 308 కేసు నమోదు చేసినా ప్రయోజనం లేదన్నారు.

Advertisement

సీఎం నివాసానికి స్వాతి మలివాల్‌ను ఎవరూ పిలవలేదని.. పక్కా పథకం ప్రకారమే ఆమె అక్కడికి వచ్చిందని.. అంతే కాకుండా ఆమె బిభవ్ గురించి సిబ్బందిని అడిగిందని బిభవ్ తరపు న్యాయవాది తెలిపారు. ఆమెకు ఎలాంటి సమస్య లేదని నిజంగానే ఆమెపై దాడి జరిగి ఉంటే అదే రోజు ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మూడు రోజుల తర్వాత ఆమె ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని తెలిపారు. స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారని బిభవ్ తరపు న్యాయవాది వెల్లడించారు.

Also Read: ‘నాకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి’

Advertisement

స్వాతి మలివాల్‌ హక్కులకు భంగం కలిగితే ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసు అని అన్నారు. ఇదిలా ఉంటే బిభవ్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై ఏడు ఎనమిది సార్లు కొట్టడంతో పాటు కడుపులో తన్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో ఈ నెల 18న బిభవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×