BigTV English

Swati Maliwal: నా తండ్రి లైంగికంగా వేధించాడు.. రాత్రైతే భయమేసేది.. స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు

Swati Maliwal: నా తండ్రి లైంగికంగా వేధించాడు.. రాత్రైతే భయమేసేది.. స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4వ తరగతి చదువున్న సమయంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులక గురయ్యానని వెల్లడించారు. ఆయనకు భయపడి కొన్నిసార్లు మంచం కింద దాక్కున్నానని తెలిపారు. తన బాల్యమంతా గృహ హింసు బాధితురాలిగానే బతికానని అన్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘నాలుగో తరగతి వరకు మేము ఆయనతోనే ఉన్నాము. అప్పుడు నన్ను అకారణంగా కొట్టేవాడు. కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేది. ఆయన ఇంట్లో అడుగుపెట్టగానే భయపడి ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నాను. ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న వాళ్లే బాధితుల ఆవేదనను ఆర్థం చేసుకోగలరు’’ అని స్వాతి మలివాల్ చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవల సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కూడా తన చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించిన విషయం తెలిసిందే. తన కన్నతండ్రే 8 ఏళ్ల వయస్సులో తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. 15 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వేధింపులకు గురయ్యానని.. ఆ తర్వాత ఎదురించడం మొదలు పెట్టానని తెలిపారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×