Channai: రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు అడుగులు వేస్తోందా? ఓటర్లు ఏ పార్టీకి కావాల్సిన మెజార్జీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠగా మారింది? తమ పార్టీ ఎమ్మెల్యేలు, మిత్రులు బయటకు వెళ్లకుండా డీఎంకె, అన్నాడీఎంకే కట్టడి చేశాయా? ఆనాడు కరుణానిధి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఇప్పుడు విజయ్ వంతు అయ్యిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలైన రాజకీయాలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకే అధికారంలోకి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి డీఎంకె-అన్నాడీఎంకె. తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, కనీసం మిత్రులు సైతం బయటకు పోకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఈ రెండు పార్టీల నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ మరో ఆరు సీట్ల దూరంలో ఉన్నాయి. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు చిన్నపార్టీలు ముందుకు రాలేదు. అటు డీఎంకె నుంచి గానీ, ఇటు అన్నాడీఎంకె కూటమి నేతలు బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో క్షణక్షణం అక్కడి రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ముందుగా ఊహించిన దళపతి విజయ్, గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్స్ తరలించారు.
ఆనాడు కరుణానిధి ఎలా గట్టెక్కారు, విజయ్‌ది అదే పరిస్థితి
ఎందుకంటే విజయ్ పార్టీ నుంచి గెలిచిన నేతల్లో డీఎంకె, అన్నాడీఎంకె నుంచి వెళ్లిన నేతలు ఉన్నారు. వాళ్లు ఒక్కసారిగా జంప్ చేస్తే డీఎంకె-అన్నాడీఎంకెలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డీఎంకే-59, అన్నాడీఎంకే- 47 స్థానాలు ఉన్నాయి. రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120 మంది సభ్యులు అవుతారు.
ఇప్పటికే కాంగ్రెస్ టీవీకే వైపు మొగ్గు చూపింది. ఈ లెక్కన రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు అడుగులు వేస్తోందన్నమాట. గత ప్రభుత్వం గడువు రాత్రితో పూర్తికావడంతో రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే.. అక్కడ రెండుసార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. 1988లో ఏడాది పాటు రాష్ట్రపతి పాలన ఏర్పడింది. ఆ తర్వాత 1991లో 144 రోజులు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు ఉన్నాయి.
ALSO READ: బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు!
ప్రస్తుతం టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎదుర్కొన్న పరిస్థితిని ఆనాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఎదుర్కొన్నారు.2006 ఎన్నికల నాటి ఘటన ఇది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో డీఎంకెకు కేవలం 96 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహాయంతో కరుణానిధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడంతో కరుణానిధిని మరింత తేలిక అయ్యింది.
ఆనాడు మైనారిటీ సర్కార్‌ను ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా పాలన చేశారు కరుణానిధి. విజయ్ తమ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం మరొక అంశం. మొత్తానికి తమిళనాట రాజకీయాలు కేంద్రంలో చేతిలో ఉన్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.