E-Paper
Advertisement

Train Accident : ఘోర ప్రమాదం.. పదుల సంఖ్యలో మృతి.. వందల మందికి గాయాలు

Train Accident : ఘోర ప్రమాదం.. పదుల సంఖ్యలో మృతి.. వందల మందికి గాయాలు
Advertisement

Train Accident : ఒడిశా రైలు ప్రమాదాన్ని తలపించే మరో రైలు ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘోర రైళ్ల ప్రమాదంలో 15 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా తీవ్రగాయాలైనట్లు సమాచారం. ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్ వద్ద ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఢాకా వెళ్లే గోధూలీ ఎక్స్‌ప్రెస్ ఛటోగ్రామ్‌కు వెళ్తున్న కార్గో రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడి ఉంటారని, రైలు కింద చాలా మంది చిక్కుకుపోయారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Advertisement

“మేము 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము, చాలా మంది గాయపడ్డారు” అని భైరబ్‌లోని ప్రభుత్వ నిర్వాహకుడు సాదికుర్ రెహ్మాన్ స్థానిక మీడియాకు తెలిపారు. బోల్తా పడిన కోచ్ ల కింద మృతదేహాలు నగిలిపోయి, చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Tags

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×