E-Paper
Advertisement

ప్రజలను విభజించే.. సనాతనాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

ప్రజలను విభజించే.. సనాతనాన్ని నిర్మూలించాలి.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Udhayanidhi Stalin: డీఎంకే పార్టీ యువ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోమారు సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని తప్పకుండా నిర్మూలించాలని పేర్కొన్నారు. గతంలో సనాతన ధర్మం గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదయనిధి సమర్థించుకున్నారు. తమిళ ప్రార్థనా గీతమైన ‘తమిళ్ తాయ్ వాళుత్తు’కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వానికి సూచించారు.

వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు అసెంబ్లీలో కొత్త స్పీకర్ గా ఎన్నికైన జె.సి.డి. ప్రభాకర్ ను అభినందించే ప్రసంగంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. గవర్నర్ సమక్షంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంలో తమిళ రాష్ట్ర గీతాన్ని మూడోస్థానానికి నెట్టేశారని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అసెంబ్లీలోనే కాకుండా, తమిళనాడులో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా ‘తమిళ్ తాయ్ వాళుత్తు’కు ఎల్లప్పుడూ ప్రథమ స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నటికీ రాజీ పడకుండా ఉండాలని టీవీకే ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.

Advertisement

మేము సీనియర్ బ్యాచ్’

తమిళ హక్కులు, సంప్రదాయాలను కాపాడుకోవడంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పరిపాలనలో డీఎంకే సీనియర్ బ్యాచ్ అన్న ఆయన.. మీకు పాఠాలు నేర్పడానికి తాము సిద్దంగా ఉన్నట్లు సీఎం విజయ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళ భాషకు అన్ని చోట్లా ప్రాధాన్యం ఉండాలని అన్నారు. సీఎం ప్రమాణస్వీకారంలో వందేమాతరం, జనగణమన తర్వాత తమిళ గీతం పాడడంపై ఈ సందర్భంగా ఉదయనిధి అభ్యంతరకరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని టీవీకే ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Also Read: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే రెండో విడత స్టార్ట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

అయితే సరిగ్గా మూడేళ్ల క్రితం సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరోమారు సనాతన ధర్మాన్ని ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ చేయడంతో బీజేపీ సైతం ఘాటుగా స్పందించింది. కోయంబత్తూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసన్.. ఉదయనిధికి సూటి ప్రశ్నలు వేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని నిర్మూలించడమే డీఎంకే పార్టీ విధానమైతే.. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. హిందూ ధర్మాన్ని దూషించడాన్ని డీఎంకే అలవాటుగా చేసుకుందని ఆయన మండిపడ్డారు. అటు బీజేపీ తమిళనాడు రాష్ట్ర విభాగం సైతం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

Also Read: ఏసీ నుండి నీరు కారుతోందా? అయితే ప్రమాదంలో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి!

Related News

నీట్ ‘లీక్’ రచ్చ.. సుప్రీంకోర్టుకు చేరిన లీకేజీ వివాదం.. NTA తీరుపై FAIMA ఫైర్!

సీఎం విజయ్ నిర్ణయంపై హైకోర్టు సీరియస్.. జ్యోతిష్యుడికి OSD పదవిపై న్యాయపోరాటం!

బల పరీక్షలో నెగ్గిన టీవీకే ప్రభుత్వం.. ఐదేళ్లుపాటు ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న సీఎం విజయ్

ములాయం కుటుంబంలో అంతులేని విషాదం.. చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అకాల మరణం

గ్యాస్ వినియోగదారులకు షాక్.. సబ్సిడీ ఇక అందరికీ రాదు.. కొత్త రూల్స్ ఇవే!

Sonia Gandhi: ఆసుపత్రిలో సోనియాగాంధీ.. ఏం జరిగిందంటూ నేతలు, కార్యకర్తలు ఆరా

మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి, 14 మందికి గాయాలు

తమిళనాడు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.. జోస్యం నిజమైంది.. జ్యోతిష్యుడికి సీఎం విజయ్ భారీ ఆఫర్!

Big Stories

Advertisement
×