E-Paper
Advertisement

తమిళనాట రాజకీయాలు మరో మలుపు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన టీవీకే పార్టీ, ఏం జరుగుతోంది?

తమిళనాట రాజకీయాలు మరో మలుపు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన టీవీకే పార్టీ, ఏం జరుగుతోంది?
Advertisement

Tamilnadu Politics: తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయా? ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో కొత్త పొత్తులు తెరపైకి రానున్నాయా? డీఎంకే-అన్నాడీఎంకె కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నాయా? గురువారం జరిగిన పరిణామాలతో టీవీకే పార్టీ అలర్ట్ అయ్యిందా? అదే జరిగితే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తమిళనాట రాజకీయాలు మరో మలుపు.. డీఎంకె-అన్నాడీఎంకె కూటమిగా ఏర్పాటైతే

Advertisement

తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎంకె-అన్నాడీఎంకె పార్టీలు సిద్ధమయ్యాయి. గడిచిన రెండురోజులుగా జరిగిన, జరుగుతున్న, జరగబోయే పరిణామాలపై కీలక నేతలంతా చర్చించారు.

ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం- టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సిద్ధమైతే తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఆ తరహా వార్తలు జోరందుకున్నాయి.

Advertisement

మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీవీకే పార్టీ

ప్రజాదరణ పొందిన టీవీకే పార్టీని పక్కనపెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకె-అన్నాడీఎంకెలు కుమ్మక్కయ్యాయని టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మెజారిటీ మార్కును సాధించడానికి టీవీకేకి మరో 5 సీట్లు అవసరమైంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది.

మిగిలిన సీట్ల కోసం వామపక్షాలు,చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. లేకుంటే న్యాయస్థానం తలుపు తట్టాలని టీవీకే పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా గురువారం కూటమి నేతలతో భేటీ అయ్యారు డీఎంకె అధినేత స్టాలిన్. ఆ సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ALSO READ: ఈయనకు ఏమైనా పిచ్చా? ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?

పార్టీ అధినేత ఎంకె స్టాలిన్‌కు అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇవ్వడం, మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా నివారించడం, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మత శక్తులకు తావు ఇవ్వకపోవడం చేయడమే నాలుగు అంశాల అజెండా తెలుస్తోంది. జాతీయ వార్తల నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×