E-Paper
Advertisement

నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!

నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!
Advertisement

Election Polling 2026: బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ మెుదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలు తెరుచుకోగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. తమిళనాడులోని 234 స్థానాలకు ఇవాళే పోలింగ్ జరగనుండగా.. బెంగాల్ లో మాత్రం తొలి విడతగా 152 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29న బెంగాల్ లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల జరిగిన అసోం, కేరళ, పుదుచ్చేరిలతో కలిపి మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

16 జిల్లాలు, 3.6 కోట్ల ఓటర్లు..

ప్రస్తుతం యావత్ దేశం దృష్టి బెంగాల్ లో జరగబోయే ఎన్నికలపైనే ప్రధానంగా ఉంది. కేంద్రంలోని బీజేపీ, సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. బెంగాల్ లో మెుత్తం 294 నియోజకవర్గాలకు గాను తొలివిడతలో 16 జిల్లాల పరిధిలోని 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 3.6 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు ఓటువేయనున్నారు. నందిగ్రామ్, డార్జిలిం్, సిలిగురి, జుల్పైగురి, కూచ్ బెహాక్ తో సహా కనీసం 80 స్థానాల్లో హోరా హోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: Intinti Ramayanam Today Episode: అవనికి భరత్ దిమ్మతిరిగే షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్..

తమిళనాడు ఎన్నికలు..

Advertisement

ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో మెుత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో కోలత్తూరు, ఎడప్పాడి, తిరుచిరాపల్లి ఈస్ట్, కోయంబత్తూరు వెస్ట్, డాక్టర్ రాధాకృష్ణ నగర్ వంటి అతి కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటర్ల విషయానికి వస్తే తమిళనాడులో మెుత్తం 5.73 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 2.93 కోట్ల మంది మహిళా ఓటర్లు. ఈ ఎన్నికల కోసం 33,133 ప్రాంతాల్లో 7,728 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటలకు మెుదలైన ఈ పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుందని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరూ ఓటు వేసేందుకు వీలుగా ఇవాళ తమిళనాడులో పబ్లిక్ హాలీడేను సైతం ప్రకటించారు.

బెంగాల్లో హోరాహోరీ

పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం కోసం నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బెంగాల్ లో ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు సర్వశక్తులు వడ్డినట్లు తెలుస్తోంది. 2011లో 35 ఏళ్ల సీపీఎం ప్రభుత్వాన్ని కూలదోసిన మమతా.. అప్పటి నుంచి బెంగాల్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. చివరిగా జరిగిన 2021 ఎన్నికల్లో ఏకంగా 215 స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటారు. అయితే ఈసారి భారీగా నకిలీ ఓట్ల తొలగింపు, ప్రధాని మోదీ, అమిత్ షా ధ్వయం బెంగాల్ ఎన్నికలను ప్రతీష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఈసారి ఫలితాలు ఏవిధంగా ఉంటాయన్న ఉత్కంఠ ఏర్పడింది. గత 15 ఏళ్ల కాలంలో బెంగాల్లో పెరిగిపోయిన అవినీతి, శాంతి భద్రతల సమస్యలు, అభివృద్ది లేమి వంటి అంశాలు ఈసారి దీదీకి ప్రతీకూలంగా మారొచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Also Read: Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 23: ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×