E-Paper
Advertisement

Delimitation Bill: డీలిమిటేషన్ వ్యవహారంపై మరోసారి చర్చ.. నారా లోకేష్ వర్సెస్ చిదంబరం, అసలేం జరిగింది?

Delimitation Bill: డీలిమిటేషన్ వ్యవహారంపై మరోసారి చర్చ.. నారా లోకేష్ వర్సెస్ చిదంబరం, అసలేం జరిగింది?
Advertisement

Delimitation Bill: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మంత్రి లోకేష్ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కౌంటరిచ్చారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఇంతకీ లోకేష్ ఏమన్నారు? ఇంకాస్త లోతుగా వెళ్తే..

డీలిమిటేషన్ వ్యవహారంపై మరోసారి చర్చ

Advertisement

ఏప్రిల్ 16 నుంచి 19 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది. దీనిపై రాజ్యాంగ సవరణ విషయంలో మూడింటి రెండొంతుల మెజార్టీ ఉండాలి. లేకపోవడంతో బిల్లులు వీడిపోయాయి.

ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును గట్టిగా సమర్థించారు మంత్రి లోకేష్. బిల్లును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు.. దక్షిణాది తీవ్ర అన్యాయం చేశాయంటూ మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

నారా లోకేష్ వర్సెస్ చిదంబరం

కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పుకొచ్చారు. అలా జరిగితే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అరడజనుకు పైగానే స్థానాలు కోల్పోతాయని అన్నారు. ఏపీ మూడు, తెలంగాణ ఓ లోక్‌సభ సీటును కోల్పోయే అవకాశముందని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు.

యువ మిత్రుడు లోకేష్ డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు లెక్కలు సరి చూడాలంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతాయని తెలిపారు. 50 శాతం సీట్లు పెంచినా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందన్నారు. ఆర్టికల్ 81ని ఎలాంటి మార్పు లేకుండా అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు సీట్ల ప్రాతినిధ్యం పరంగా నష్టపోతాయన్నారు.

ALSO READ: విజయ్ కొత్త కేబినెట్‌.. ఆపై విజయసాయిరెడ్డి విసుర్లు, మహా తమిళనాడు ద్రోహం

అందుకే ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించాయని గుర్తు చేశారు. ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరిగినా మొత్తం సీట్లలో ఏపీ వాటా తగుతోందన్నారు. బీజేపీ ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిందన్నారు. దయచేసి మరోసారి లెక్కలు సరిచూసుకోవాలన్నారు చిదంబరం. వెంటనే రియాక్ట్ అయ్యారు మంత్రి లోకేష్.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్లు, 2026 జనాభా లెక్కల తర్వాత ముగుస్తుందన్నారు. ఆ తర్వాత పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్నారు. ఈ నష్టాన్ని ఆపడానికే ఎన్డీయే ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి లోకేష్.

 

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×