BigTV English

Chennai : ముక్కలు ముక్కలుగా నరికి.. దారుణంగా మాజీ భర్త హత్య..ఎందుకంటే..?

Chennai : ముక్కలు ముక్కలుగా నరికి.. దారుణంగా మాజీ భర్త హత్య..ఎందుకంటే..?

Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన హత్య.. తీవ్ర సంచలనం సృష్టించింది. థాయ్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న జయంతన్ ను హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు చేసి.. సూట్ కేస్ లో పార్సిల్ చేసి ఏకంగా బీచ్ లోనే పాతిపెట్టారు. విచారణలో.. జయంతన్ మాజీ భార్యే ఈ హత్య చేసినట్లు వెల్లడైంది. మార్చి 18న పని నిమిత్తం స్వగ్రామం విల్లుపురం వెళ్లిన జయంతన్.. ఎంతకూ తిరిగిరాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 1న పోలీసులు సెక్స్ వర్కర్ పాకియలక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేమీ తెలియదన్న పాకియలక్ష్మీ.. తర్వాత జయంతన్ ను హత్య చేసినట్లు ఒప్పుకుంది.


విల్లుపురం జిల్లాకు చెందిన జయంతన్.. పాకియలక్ష్మీతో ప్రేమలో పడి.. 2020లో వివాహం చేసుకున్నాడు. గత నెల 19న జయంతన్ ఆమె దగ్గరకు వెళ్లి గొడవపడ్డాడు. అప్పుడే అతడిని హత్య చేసినట్లు ఆమె తెలిపింది. డెడ్ బాడీని ముక్కులుగా చేసి.. మార్చి 20, 26 తేదీల్లో చెంగల్ పట్టు జిల్లా కోవలం బీచ్ సమీపంలో గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు వివరించింది.

ఆమెకు భవన నిర్మాణ కార్మికుడు వెల్ మురుగన్ సాయం చేసినట్లు తెలిపింది. పాకియలక్ష్మీని అరెస్ట్ చేసిన పోలీసులు.. చెన్నైకి తరలించారు. బీచ్ లో డెడ్ బాడీని పూడ్చిన స్థలాన్ని గుర్తించి.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టంకు తరలించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×