Jantar Mantar: ఢిల్లీలో నిరసనలు అంటే అందరికీ వేదిక జంతర్ మంతర్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ వేదిక మారబోతోందా? అదే వేదిక కంటిన్యూ అవుతోందా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. అక్కడ నిరసనల వల్ల ప్రజలకు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. మరి న్యాయస్థానం నిర్ణయం ఏ విధంగా ఉంటుందో? అన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా రాజకీయ పార్టీలు, యూనియన్లు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటాయి. దీనివల్ల తమ వాయిస్ ప్రభుత్వానికి వినిపిస్తుందని బలంగా నమ్ముతారు. నిరసనలకు ఈ ప్రాంతం అనువైన వేదిక కాదన్నది పిటిషన్ వాదన. ఆందోళనలతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నిరసనల వల్ల అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని అందులో ప్రస్తావించాడు పిటిషన్. నిరసనలు చేపట్టేందుకు ప్రత్యామ్నాయంగా మరొక వేదిక కేటాయించేలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని ఇంటి వరకు చేపట్టనున్న పాదయాత్ర గురించి అందులో ప్రస్తావించారు. జులై 20 నాటి పరిస్థితులు చోటు చేసుకోకుండా నివారించాలని అందులో ప్రస్తావించాడు. దీనిపై వాదనలు వినేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం-సంబంధిత యంత్రాంగాలకు నోటీసులు ఇచ్చింది.
ముఖ్యమైన విషయమని తాము భావిస్తున్నామని, దీనిపై సంబంధిత అధికారుల నుంచి సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. పాదయాత్ర విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో భద్రతా సిబ్బందికి తెలుసని, వారు సరిగా నిర్వహించని పక్షంలో మమ్మల్ని సంప్రదించవచ్చని సూచన చేశారు. ఈ విషయాన్ని విడిగా విచారణ చేయనుంది న్యాయస్థానం.
ALSO READ: అమెరికా చదువులపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సీజేపీ ఫౌండర్