Team India Players Injury 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ వరల్డ్ కప్ ను ప్రతీ జట్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అయితే.. ఐపీఎల్ 2027 ఆడకుండా క్రికెటర్లకు దిశా నిర్దేశం కూడా చేసింది. అటు పాకిస్తాన్ క్రికెటర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది పీసీబీ. ఇలాంటి క్రమంలో టీమిండియా పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా టీమిండియా స్టార్ క్రికెటర్లు గాయాల బారిన పడుతున్నారు. ఒకరు ఇద్దరు గాయాల బారిన పడితే పెద్ద ఎఫెక్ట్ పడేది కాదు. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే దాదాపు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు గాయాల బారీన పడ్డారు. దీంతో టీమిండియా యాజమాన్యం తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లింది.
2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే టీమ్ ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న ఎనిమిది క్రికెటర్లు గాయాల బారిన పడ్డారు. టీమిండియా రేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) మొన్నటి వరకు అద్భుతంగా రాణించి.. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమయ్యాడు. కానీ ఏమైందో తెలియదు కానీ అతడి పాత గాయం తిరగబడింది. జస్‌ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలి గాయం.. అతడిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కు కూడా అతను దూరమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. అతడు ఎప్పుడు జట్టులోకి వచ్చేది తెలియడం లేదు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికీ కోలుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆల్రౌండర్లు గాయాల బారిన పడడం టీమిండియాకు నిజంగా ఎదురు దెబ్బే.
గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా కూడా ఇంజూరీ స్టేజ్ లోనే ఉన్నారు. వాళ్లు రీ-ఎంట్రీ ఎప్పుడు ఇచ్చేది తెలియడం లేదు. అటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా గాయం బారిన పడ్డాడు. మిస్టరీ స్పిన్నర్ గా టీమిండియాలో కొనసాగుతున్న వరుణ్.. గాయం పై ఇప్పటికీ అప్డేట్ రాలేదు. అతడు ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని చెబుతున్నారు. అలాగే ప్రిన్స్ యాదవ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మొన్నటి వరకు జింబాబ్వే అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్ కూడా గాయం బారిన పడ్డాడు. మరో బుమ్రా లాగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ యాదవ్ జట్టుకు దూరం కావడం టీమిండియా కు పెద్ద నష్టమే. అటు రోహిత్ శర్మ కూడా తరచూ గాయపడుతున్నాడు. 2027 వరల్డ్ కప్ వరకు ఫిట్ గా ఉంటేనే అతడు.. ఆడతాడు. లేకపోతే యశస్వి జైష్వాల్ కు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఎనిమిది మంది గాయాలతో టీమిండియా సతమతం అవుతోంది. వీటన్నిటిని అధిగమించి టీమిండియా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.