E-Paper
Advertisement

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!
Advertisement

Stray Dogs Protest: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర పంచాయతీ కార్యాలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న వీధికుక్కల బెడదపై చర్యలు తీసుకోవడం లేదంటూ శివసేన (యూబీటీ) యువసేన కార్యకర్తలు ఏకంగా సంబంధిత అధికారి కార్యాలయానికి వీధి కుక్కలను తీసుకెళ్లి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

టేబుల్‌పైకి కుక్క..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రంధావే తన అనుచరులతో కలిసి నిఫాడ్ నగర పంచాయతీ ప్రధాన అధికారి ధీరజ్ భమ్రే కార్యాలయానికి వెళ్లారు. వెంట తెచ్చిన సంచుల్లో ఓ దాని ముడి విప్పి ఒక్కసారిగా వీధి కుక్కను అధికారి టేబుల్ లో వదిలారు. ఈ ఊహించని పరిణామానికి షాక్ తిన్న అధికారి భామ్రే వెంటనే తన కుర్చీ నుంచి వెనక్కి జరిగారు. మరోవైపు కుక్క ఆ టేబుల్ మూలకు వెళ్లి.. అక్కడ ఉన్న ఫైల్స్ దగ్గర తాపీగా విశ్రాంతి తీసుకోవడం వీడియో గమనించవచ్చు.

Advertisement

కరెన్సీ నోట్ల దండ వేసేందుకు యత్నం

అయితే కుక్కలను వదిలిన అనంతరం రంధావే రూ. 20 నోట్లతో తయారు చేసిన ఒక దండను పంచాయతీ ఆఫీసర్ మెడలో వేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న ఇతర సిబ్బంది ఆయన్ను అడ్డుకోవడంతో చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారి కేవలం టెండర్ పనుల పైన, డబ్బు సంపాదనపైనే దృష్టి సారిస్తున్నారని అందుకే నిరసనగా ఈ నోట్ల దండను తీసుకొచ్చామని రంధావే ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ డబ్బుల దండను అధికారి టేబుల్ పైనే పడేశారు.

6 నెలలుగా పట్టించుకోవడం లేదని ఆగ్రహం

Advertisement

ఈ ఘటనపై మీడియా ప్రతినిధులతో రంధావే మాట్లాడుతూ తమ నిరసనకు గల కారణాలను వెల్లడించారు. ‘గత 6 నెలలుగా నిఫాడ్ పరిధిలో వీధికుక్కల బెడద తీవ్రమైంది. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఒక చిన్న పిల్లాడిపై దాడి చేసి కరిచాయి. మహిళలను, వెళ్లే బాటసారులను వెంటపడి తరుముతున్నాయి. ఈ సమస్యపై ఫొటోలతో సహా చీఫ్ ఆఫీసర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాం. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఆయనకు సమస్య తీవ్రత అర్థం కావాలని ఈ విధంగా నిరసన తెలిపాం’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read: రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!

ఎనిమిది రోజుల డెడ్ లైన్.. లేదంటే!

ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో హారతులకు, మండపాలకు వెళ్లే భక్తులపైకి కుక్కలు ఎగబడుతున్నాయని రంధావే ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సదరు అధికారి మేల్కోవాలని హెచ్చరించారు. అధికారికి ఇది చివరి హెచ్చరిక వార్నింగ్ అన్న రంధావే.. రాబోయే 8 రోజుల్లో వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఈసారి అంతకంటే ఎక్కువ కుక్కలను తీసుకొచ్చి ఆయన కార్యాలయంలో వదులుతామని స్పష్టం చేశారు.

Also Read: శాలరీ అకౌంట్ ఉందా? అయితే ఈ 10 అమేజింగ్ బెనిఫిట్స్.. అస్సలు మిస్ అవ్వకండి!

Tags

Related News

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

Big Stories

Advertisement
×