E-Paper
Advertisement

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం..  ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..
Advertisement

Bengaluru: ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో రగిలిపోయారు యువతి కుటుంబ సభ్యులు. ఆమెను తిరిగి తీసుకురావడానికి పలువురు వ్యక్తులు బెంగళూరు నగరానికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో నిందితులు తప్పించుకునే పలు వాహనాలను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో లవ్ స్టోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం

రాజస్థాన్‌లోని మేల్వాస్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల పూజ- 23 ఏళ్ల ఓం ప్రకాశ్ ఇష్టపడ్డారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు, జీవితంలో ఒక్కటి అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యుల చెవిలో పడింది. అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కులాలు వేరుగా కావడంతో ఈ వివాహాన్ని కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీన్ కట్ చేస్తే.. రాజస్థాన్ నుంచి సీన్ బెంగుళూరు షిఫ్ట్ అయ్యింది. యువ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దాదాపు 9 నెలలు అవుతున్నట్లు సమాచారం. బెంగళూరులోని అగ్రహార దాసనహళ్లిలో అద్దెకు ఉంటున్నారు.

ప్రేమ వివాహం చేసుకోవడం రగిలిపోయిన కుటుంబసభ్యులు

Advertisement

పూజ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. లవ్ మ్యారేజ్‌ చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు యువతి కుటుంబం. ఆమెని తిరిగి తీసుకురావడానికి నలుగురు వ్యక్తులను పూజ ఉంటున్న బెంగళూరుకు పంపింది. రాత్రి 8 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు.. పూజ ఇంట్లోకి చొరబడి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతివేగంగా కారును నడుపుతూ విజయ్‌నగర్- మగాడి రోడ్డు ప్రాంతంలో బీభత్సం సృష్టించారు. పలు వాహనాలను ఢీకొట్టడంతో ఏకంగా ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 57 ఏళ్ల జయలక్ష్మి తలకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ALSO READ: అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

Advertisement

మిగతా వారికి చికిత్స అందిస్తున్నారు. కారు బీభత్సాన్ని గమనించిన స్థానికులు.. కారును వెంబడించి అడ్డగించారు. కారులో ఉన్నవారిని బయటకు లాగి కుమ్మేశారు. ఈలోగా పూజ జోక్యం చేసుకుని తన కుటుంబ సభ్యులని చెప్పింది. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లడానికి వచ్చారని చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని పూజను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. కారు నడిపిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. వాహనాన్ని సీజ్ చేసిన విజయ్ నగర పోలీసులు, నిందితులను అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

 

Related News

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

లాడ్జి బాత్రూంలో యువతి మృతదేహం.. ఇద్దరు యువకులు పరార్, బెంగుళూరు సమీపంలో ఘటన

ఇదేందయ్యా ఇది.. 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి.. వీడియో వైరల్

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

Big Stories

Advertisement
×