E-Paper
Advertisement

Jaipur: త‌ల్లి ఉద్యోగం కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా? రంగంలోకి సుఫారీ గ్యాంగ్

Jaipur: త‌ల్లి ఉద్యోగం కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా? రంగంలోకి సుఫారీ గ్యాంగ్
Advertisement

Jaipur: పని పాటా లేని కొందరు పక్కదారి పడుతున్నారు. కష్టపడి చదువుకోకుండా అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను సైతం చంపేస్తున్న ఘటనలు బయటపడుతున్నారు.తాజాగా అలాంటి ఘటన ఒకటి బయటపడింది. ఉద్యోగం కోసం ఏకంగా క‌న్న త‌ల్లినే హ‌త్య చేసింది ఓ కూతురు. సంచలనం రేపిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.

రాజస్థాన్ జైపూర్‌లో దారుణమైన ఘటన- రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివాసం ఉంటున్నారు నీరజ్ శర్మ ఫ్యామిలీ. ఏడాది కిందట ఆమె భర్త చనిపోయారు. ఆయన కోర్టులో ఉద్యోగం చేసేవారు. భర్త మరణానంతరం కారుణ్య నియామకం కింద ఎల్‌డీసీగా నీరజ్‌కు ఉద్యోగం వచ్చింది. జూలై 3న జైపూర్ సిటీలో సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement

ఉద్యోగం-ఆస్తి కోసం తల్లిని లేపేసిన కన్న కూతురు-నీరజ్ శర్మ తన కొడుకుని కోచింగ్ సెంటర్ వద్ద దించి ఇంటికి వస్తుండగా అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఆమెని ఢీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు ఆమె 100 అడుగుల దూరంలోకి ఎగిరిపడింది. అక్కడికక్కడే నీరజ్ శర్మ మరణించారు. ఈ ఘటన తర్వాత వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు.

ఈ ఘటన ప్రమాదం కాదని, పథకం ప్రకారం చేసిన హత్యగా ఓ అంచనాకు వచ్చారు. నీరజ్‌‌శర్మ అంత్యక్రియల తర్వాత దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు ఈ హత్య వెనుక ఉన్నట్లు తేలింది. దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. నీరజ్ శర్మకు కొడుకు-కూతురు ఉన్నారు. కొడుకు చదువుతున్నాడు.

Advertisement

బంధువులతో కలిసి కూతురు ప్లాన్- కుమార్తె ఆయుషి శర్మ తండ్రి ఉద్యోగంపై కన్నేసింది. తాను ఉద్యోగం చేస్తానని తల్లి ముందుకు రావడం ఆయూషికి రుచించ‌లేదు. ఆ తర్వాత ఆస్తిని పంచాలంటూ ఒత్తిడి చేసింది. కూతురి మాట త‌ల్లి విన‌లేదు.. అప్పటి నుంచి పగతో రగిలిపోయేది ఆయుషి. ఎలాగైనా ఉద్యోగం దక్కించుకోవాలని డిసైడ్ అయ్యింది. జన్మనిచ్చిన త‌ల్లిని చంపాలని భావించింది.

అందుకోసం ఓ గ్యాంగ్‌ని రంగంలోకి దించింది. తల్లి నీరజ్‌ను చంపడానికి దగ్గర బంధువులు మోహన్ స్వరూప్, కజిన్ రవితో కలిసి కుట్ర పన్నింది ఆయుషి. ముగ్గురు కలిసి భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన హేమంత్ శర్మతో రూ. 7 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు. తొలుత నిందితులు థార్ వాహనాన్ని తీసుకుని బాధితురాలిపై నిఘా పెట్టారు. ప్రణాళికను అమలు చేయడంలో విఫలమయ్యారు.

పోలీసుల విచారణలో డొంక కదిలింది- హత్యకు నెల ముందు కార్పియో వాహనాన్ని తీసుకుని నీరజ్ శర్మ కదలికలను గమనించారు. హత్య జరిగిన రోజు లోకేషన్‌లో ఎవరున్నారనే దానిపై హేమంత్ శర్మ.. నీరజ్ లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసి షేర్ చేశాడు. ఆకాష్ శర్మ స్కార్పియో నడపుతుండగా అరవింద్ శర్మ అందులో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు స్కార్పియోను వదిలేసి టూ వీలర్‌పై పరారయ్యారు.

ALSO READ: ఐఐటీలను అధిగమించేలా.. బెంగళూరు ఐఐఐటీ విద్యార్థి‌కి బంపరాఫర్, ఏకంగా రూ.1.5 కోట్ల ప్యాకేజ్

నీరజ్‌శర్మ సోదరుడు రాకేష్ కుమార్ శర్మ ఫిర్యాదు చేయడంతో ఈ యవ్వారం బయటపడింది. ఆస్తి విషయంలో కూతురు-అత్తమామల కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆయుషి శర్మ, మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాతవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కుట్రదారులలో మరొకడు రవి పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Related News

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

Big Stories

Advertisement
×