E-Paper
Advertisement

దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు

దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు
Advertisement

Hyderabad: ఈ మధ్యకాలంలో కొందరు అధికారులు రూటు మార్చారు. జీవితాంతం నిజాయితీగా ఉంటే ఏముంటుందని భావించారు. సైలెంట్‌గా ఆస్తులను కూడబెట్టేస్తున్నారు. ఏ స్థాయిలో అంటే కనీసం రెండుమూడు తరాలు కూర్చొని తినేంతగా సంపాదిస్తున్నారు. ఈ ఉచ్చులో పడి చివరకు అడ్డంగా దొరికిపోతున్నారు. అసలే టెక్ యుగం, ఎక్కడ ఏం దాచినా క్షణాల్లో పట్టేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కనీసం నెలకు ఓ అధికారి ఏసీబీ చిక్కుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డిని అరెస్ట్‌ చేశారు ఏసీబీ అధికారులు. కళ్లు చెదిరేలా ఆయన ఆస్తులు కూడబెట్టారు.

తెలంగాణలో ఏసీబీకి చిక్కుతున్న అధికారులు- హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్-పిసిఎస్‌లో డిఎస్పీగా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనకు సంబంధించి నివాసంతో పాటు మొత్తం 16 ప్రాంతాల్లో సోదాలు చేశారు. తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా ఆయన నివాసంతోపాటు, బంధువులు, స్నేహితులు, బినామీదారులు, సహచరులు ఉన్నారు. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.

Advertisement

కళ్లు చెదిరేలా ఆస్తులు కూడబెడుతున్న అధికారులు-తొలుత అనారోగ్యం కారణంగా ఆయన్ని అరెస్ట్‌ చేయకుండా నోటీసులు ఇచ్చింది ఏసీబీ. తాజాగా ఆయన్ని అరెస్ట్ చేసింది. దీంతో ఆయన్ని పదవి నుంచి సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్‌ ఇబ్రహీంబాగ్‌ వెసెల్లా మెడోస్‌లోని విల్లాలో ఉంటున్నారు సదరు అధికారి. ఆయనకు సంబంధించి 20 చోట్ల స్థిరాస్తుల్ని గుర్తించింది.

కేవలం తెలంగాణలో కాకుండా కర్ణాటకలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. ఏకంగా 44 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. బెంగళూరు నగరంలో భీంరెడ్డికి సంబంధించి ఎకరా కమర్షియల్ ల్యాండ్ ఉంది. ఆయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.200 నుంచి 300 కోట్లు ఉండవచ్చన్నది ఓ అంచనా.

Advertisement

డీఎస్పీ భీంరెడ్డి ఆస్తుల చిట్టా రూ. 300 కోట్లు? ఏసీబీ వివరాల మేరకు భీంరెడ్డి తన సర్వీసు కాలంలో అవినీతి, అనేక మార్గాల ద్వారా భారీ ఆస్తులు కూడబెట్టినట్టు తేల్చారు. సోదాల సమయంలో ఆయన ఇంట్లో సుమారు రూ. 3.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బినామీ వ్యక్తి ఇంట్లో మరో రూ. 40 లక్షలు లభించింది. ఏకంగా 2 కిలోల బంగారు ఆభరణాలు, దాదాపు 20 కిలోల వెండి వస్తువులు లభించాయి.

ALSO READ: హైదరాబాద్ సిటీలో పెద్ద అక్రమ నిర్మాణం.. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు, గుర్తించిన హైడ్రా

ఆయన అకౌంట్లో రూ. 19 లక్షల 91 వేల నగదు గుర్తించారు. ఆ అధికారి నుంచి ఏసీబీ అధికారులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసు దర్యాప్తు ఊపందుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే నెలలో భీంరెడ్డి.. భార్యతో కలిసి చార్ ధామ్ యాత్రకు బయలుదేరడానికి ముందు డైరీని రాసినట్టు తెలుస్తోంది.

చార్ ధామ్ యాత్రకు ముందు డీటేల్స్ బయటకు- ఆస్తులు, పెట్టుబడులు, అప్పులు, బినామీదార్ల పేర్లు ప్రస్తావించారట. యాత్రకు ముందు డైరీ స్కాన్ చేసిన కాపీలను వాట్సాప్ ద్వారా ఇద్దరు కొడుకులతో పంచుకున్నట్లు తేలింది. ఆయనకు సంబంధించి అనేక ఆస్తులను, ఆర్థిక లావాదేవీలు గుర్తించడంలో డైరీ సహాయపడిందని చెప్పారు. ఆయన ఆస్తుల చిట్టాపై ఓ లుక్కేద్దాం.

1. హైదరాబాద్ సిటీలోని ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా

2. టెలికాం నగర్‌లో ఒక నివాసం ఉంది. జి+2 -పెంట్ హౌస్ ఉంది.

3. టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్ ఉంది.

4. గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ ఉంది.

5. మణికొండ లాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో G+5 వాణిజ్య సముదాయంలో వాటా కలిగి ఉన్నారు.

6. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ వాణిజ్య స్థలం ఉంది.

7. శంషాబాద్ సమీపంలో తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు ఉన్నాయి.

8. ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఒక ఖాళీ స్థలం గుర్తించారు.

9. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

10. కర్ణాటకలో 6 ఎకరాల భూమి ఒక దగ్గర, మరో దగ్గర 38 ఎకరాలు వ్యవసాయ భూములున్నాయి.

11. బెంగళూరులోని దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి ఉంది.

12. నాగోల్‌లోని కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం,

13. పటాన్‌చెరులోని జిపిఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల విస్తీర్ణం ఖాళీ స్థలం, ఆ ఏరియాలోని మరో ప్రాంతంలో 200 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలం ఉంది.

14. వికారాబాద్ లోని మోమిన్‌పేట్‌లో 1,000 చదరపు గజాల విస్తీర్ణం భూమి, మరో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

15. మెస్సర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ. 75 లక్షలు పెట్టుబడి పెట్టారు. 16. ముచింతల గ్రామంలోని సిసి కుంటలో 4-20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు అధికారులు.

 

 

Related News

హైదరాబాద్ సిటీలో పెద్ద అక్రమ నిర్మాణం.. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు, గుర్తించిన హైడ్రా

ఫిఫా వరల్డ్ కప్-2026: ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్, విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు సెల‌వులు, కాకపోతే

Oil Palm: ఆయిల్ ఫామ్ పంటలపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఎమన్నారంటే..?

పాలకుర్తిలో ఇన్నోవా కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం!

మీ అయ్యవల్లే ఈ పరిస్థతి.. కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్..!

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్

Big Stories

Advertisement
×