E-Paper
Advertisement

Ketan Agarwal Case: కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నాలుగు నెలల ముందే, సియా ఆ పని చేసిందా?

Ketan Agarwal Case: కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నాలుగు నెలల ముందే, సియా  ఆ పని చేసిందా?
Advertisement

Ketan Agarwal Case: పుణె సిటీ రియల్టర్‌ కేతన్ అగర్వాల్ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. సియా చేసిన లీలలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు నెలల ముందే సీక్రెట్‌గా వివాహం చేసుకుందట సియా గోయల్. ఇంకా దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు: పూణె యంగ్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా గోయల్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. కేతన్ అగర్వాల్ హత్యకు ముందు నిందితురాలు సియా గోయల్ నాలుగు నెలల ముందు కొరుకున్న ప్రియుడు చేతన్ చౌదరిని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారట.

Advertisement

ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా వారిద్దరి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాటింగులను పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 14న కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినట్టు సమాచారం.

నాలుగు నెలల ముందే సియా ఆ పని: అయితే చివరి నిమిషంలో సియాకు ధైర్యం చాలకపోవడంతో ఆ ప్లాన్ కాస్త ఫెయిల్ అయ్యిందని తెలిపారు పోలీసులు.  ఈ క్రమంలో చేతన్‌కు ఓ మెసేజ్ చేసిందని, ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలలేదని, ఇద్దరం కలిసి కొండపై నుండి కిందకు కేతన్ నెట్టేద్దామన్నది అందులోని సారాంశం. తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో బయటపడింది.

Advertisement

నిందితుల ఇద్దరి ఫోన్ కాల్స్, చాటింగ్‌లను గడిచిన ఆరేడు నెలల్లో కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని విశ్లేషించారు. ఈ ఆధారాలు దర్యాప్తుకు కీలకంగా మారాయని తెలిపారు. కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతో సియా-చేతన్ సీక్రెట్ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోంది.

ALSO READ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గురజాత్ హైకోర్టు సంచలన తీర్పు, 38 మందికి ఉరిశిక్ష 

రహస్య వివాహం తర్వాత కేతన్‌ను హత్య కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. సియా-చేతన్ సాయంతో కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సియా-చేతన్ రిమాండ్‌లో ఉన్నారు.

Related News

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

తండ్రి వీలునామాలో పేరు లేకున్నా ఆస్తిలో వాటా పొందిన కొడుకు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?

నాడు రూ.300 పెట్టుబడి.. నేడు వేల కోట్ల అధిపతి.. రజినీ బెక్టర్ వ్యాపార విజయ ప్రస్థానం ఇదే!

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

Big Stories

Advertisement
×