E-Paper
Advertisement

వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!

వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు, శిథిలాల కింద 30 మందికి పైగా కార్మికులు!
Advertisement

Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి మరోసారి కోరలు చాచింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. అనక్కంపొయిల్‌-కల్లాడి సొరంగం (ట్విన్-టన్నెల్) నిర్మాణ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో జరిగిన ఈ విపత్తులో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న సుమారు 30 మందికి పైగా కార్మికులు బురద, శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేగంగా సాగుతున్న సహాయక చర్యలు

Advertisement

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులు, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అక్కడ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ స్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తుండగా, తిరువనంతపురం నుండి మంత్రులు టి. సిద్ధిక్, ఎ.పి. అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు.

Also Read: ఏపీ హస్తకళల రేంజ్ మార్చబోతున్న పవన్ కల్యాణ్.. ఆ ‘గ్లోబల్ ప్లాన్’ ఏంటంటే?

Advertisement

బాధిత కుటుంబాలకు ప్రియాంక గాంధీ పరామర్శ

ఈ దారుణ ఘటనపై వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తామంతా అండగా ఉంటామని, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. శిథిలాల కింద ఉన్న తమ వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.

అలాగే, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని యూడీఎఫ్ (UDF) నాయకులకు, కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలంతా అధికార యంత్రాంగం ఇచ్చే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, రెస్క్యూ టీమ్‌లకు పూర్తి మద్దతు అందించాలని ఆమె కోరారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఎదురవుతోంది.

Related News

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×