E-Paper
Advertisement

అందమైన కిచెన్ కోసం సింక్ కింద మ్యాజిక్.. ఈ ఫిల్టరే లేటెస్ట్ ట్రెండ్!

అందమైన కిచెన్ కోసం సింక్ కింద మ్యాజిక్.. ఈ ఫిల్టరే లేటెస్ట్ ట్రెండ్!
Advertisement

Under counter water purifier: ఇంటిని అందంగా, మోడ్రన్‌గా డిజైన్ చేసుకోవడం ఈరోజుల్లో ఒక పెద్ద ట్రెండ్. ముఖ్యంగా కిచెన్ విషయానికి వస్తే అందరూ ‘Modular Kitchen’ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే గోడకు వేలాడే పాతకాలపు వాటర్ ప్యూరిఫైయర్ల కంటే.. సింక్ కింద దాక్కుని ఉండే అండర్ కౌంటర్ వాటర్ ఫ్యూరిఫయర్స్ కు ఇప్పుడు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. అసలు కిచెన్ లుక్‌ని మార్చేస్తున్న ఈ అండర్-కౌంటర్ ప్యూరిఫైయర్లు ఎందుకు అంత ట్రెండింగ్ లో ఉన్నాయో,వాటి సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అండర్-కౌంటర్ వాటర్ ప్యూరిఫైయర్స్ లాభాలు:

1. క్లాసిక్ & క్లీన్ కిచెన్ లుక్:

ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లను చాలా లగ్జరీగా డిజైన్ చేసుకుంటున్నారు. మోడ్యులర్ కిచెన్‌లో చిందరవందరగా వైర్లు, పైపులు కనిపిస్తే.. అస్సలు బాగోదు. కానీ అండర్-కౌంటర్ ప్యూరిఫైయర్ మెయిన్ మెషిన్, స్టోరేజ్ ట్యాంక్ అన్నీ సింక్ కింద క్యాబినెట్ లోపల దాగి ఉంటాయి. దీని వల్ల కిచెన్ చాలా నీట్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది.

2. స్పేస్ సేవింగ్ మ్యాజిక్:

Advertisement

ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్‌లలో కిచెన్ స్పేస్ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. గోడ మీద స్పేస్‌ను ప్యూరిఫైయర్ ఆక్రమిస్తే.. అక్కడ మైక్రోవేవ్ ఓవెన్ లేదా ఇతర రాక్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అండర్-సింక్ మోడల్స్ వాడటం వల్ల గోడల మీద స్పేస్ పూర్తిగా ఖాళీగా ఉంటుంది. సింక్ కింద సాధారణంగా.. వేస్ట్ అయ్యే స్పేస్‌ను ఇది పర్ఫెక్ట్‌గా వాడుకుంటుంది.

3.లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ:

చాలా మంది వాల్-మౌంటెడ్ ఫిల్టర్స్ బరువు ఎక్కువ అవుతాయేమోనని 7 నుంచి 8 లీటర్ల కెపాసిటీ ఉన్నవే కొంటారు. కానీ.. అండర్-కౌంటర్ మోడల్స్ కింద ఫ్లోర్ మీద లేదా క్యాబినెట్ బేస్ మీద ఉంటాయి కాబట్టి, బరువు సమస్య ఉండదు. వీటిలో 10 నుంచి 12 లీటర్ల పెద్ద హైడ్రోస్టాటిక్ ట్యాంకులు వస్తాయి. దీని వల్ల పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా సరే, వాటర్ కొరత అస్సలు ఉండదు.

4. హై-ప్రెజర్ వాటర్ ఫ్లో :

Advertisement

వాల్-మౌంటెడ్ ఫిల్టర్లలో నీళ్లు గ్రావిటీ (గురుత్వాకర్షణ) వల్ల నెమ్మదిగా వస్తాయి. కానీ అండర్-కౌంటర్ సిస్టమ్స్‌లో ‘Hydrostatic Storage Tank’ ఉంటుంది. ఇది ప్రెజర్‌తో నీటిని బయటకు నెడుతుంది. అందుకే.. మీరు క్యాబినెట్ పైన ఉండే టాప్ తిప్పగానే చాలా స్పీడ్‌గా, ఫోర్స్‌గా నీళ్లు వస్తాయి. బాటిల్స్ లేదా పెద్ద గిన్నెలు నింపుకోవడానికి అస్సలు టైమ్ పట్టదు.

Also Read: థియేటర్ మీ ఇంట్లోనే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

5. తక్కువ శబ్దం..ఎక్కువ సేఫ్టీ:

ఈ మోడ్రన్ ప్యూరిఫైయర్స్ క్యాబినెట్ లోపల క్లోజ్ అయి ఉండటం వల్ల, అవి పనిచేసేటప్పుడు వచ్చే పంప్ శబ్దం బయటకు అస్సలు వినిపించదు. కిచెన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైగా బయట పిల్లలు ఆడుకుంటూ వైర్లు లాగేస్తారనే భయం ఉండదు. దుమ్ము-ధూళి పడే ఛాన్స్ కూడా చాలా తక్కువ.

ధర విషయానికి వస్తే.. వాల్-మౌంటెడ్ మోడల్స్ కంటే అండర్-కౌంటర్ మోడల్స్ కొంచెం ఖరీదైనవి కావచ్చు. కానీ.. మీ కిచెన్ లుక్ చెడిపోకుండా ఉండాలన్నా, స్పేస్ కలిసి రావాలన్నా ఈ ఇన్వెస్ట్‌మెంట్ వంద శాతం వర్త్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కొత్త ఇల్లు కడుతున్నా ..లేదా కిచెన్ రినోవేట్ చేస్తున్నా.. కచ్చితంగా అండర్-సింక్ వాటర్ ప్యూరిఫైయర్ ఆప్షన్‌నే లాక్ చేసుకోండి.

Related News

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×