E-Paper
Advertisement

నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!

నగరమంతా జలమయం.. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన స్పైడర్ మ్యాన్.. నెట్టింట హల్ చల్!
Advertisement

Bhiwandi SpiderMan: మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై పరిసర ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా థానే జిల్లాలోని భివండీ నగరంలో మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతినడంతో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి స్థానిక ప్రజలు నరకయాతన అనుభవించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమైన చోట ఒక సామాన్య యువకుడు నిజమైన సూపర్‌హీరోలా రంగంలోకి దిగి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్‌తో రంగంలోకి…

భివండీకి చెందిన షాదాబ్ మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్.. సోషల్ మీడియాలో @shaddyman98 అనే హ్యాండిల్‌తో బాగా పాపులర్ అయ్యాడు. నగరంలో రోడ్లన్నీ నీట మునిగి, వాహనాలు కదల్లేని స్థితికి చేరుకోవడాన్ని చూసి అతను ఇంట్లో ఊరికే కూర్చోలేకపోయాడు. వెంటనే తను రీల్స్ కోసం వాడే ‘స్పైడర్‌మ్యాన్’ కాస్ట్యూమ్‌ను ధరించి రోడ్డుపైకి వచ్చాడు. వర్షంలో తడుస్తూనే గంటల తరబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం ప్రారంభించాడు.

Advertisement

జలమయమైన వీధుల్లో సేవలు

షాదాబ్ మోమిన్ కేవలం ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడమే కాకుండా, మోకాళ్ల లోతు నీటిలో నిలబడి రోడ్లపై పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను స్వయంగా తొలగించాడు. డ్రైనేజీ రంధ్రాల వద్ద అడ్డుపడిన కవర్‌లను తీసివేసి, వరద నీరు త్వరగా కిందకు పోయేలా చేశాడు. ఒకవైపు భారీగా వాన పడుతున్నా, వాహనదారులు ఇబ్బంది పడకుండా వారికి దిశా నిర్దేశం చేస్తూ గంటల తరబడి శ్రమించాడు.

వరద నీటిలో చిన్నారుల తరలింపు

Advertisement

రోడ్డుపై నిలిచిన మోకాళ్ల లోతు నీళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు సైతం షాదాబ్ అండగా నిలిచాడు. వారిని భూజంపై కూర్చోపెట్టుకొని వరద నీటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాదాబ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా.. అవి కాస్త వైరల్ గా మారాయి. కష్టకాలంలో షాదాబ్ చేసిన పనిని స్థానికులు మెచ్చుకుంటున్నారు.

Also Read: కొత్త పవర్ బ్యాంక్ వచ్చిందోచ్.. 10,000mAh బ్యాటరీ, LED స్క్రీన్.. జెట్ వేగంతో ఛార్జింగ్ ఫుల్!

సోషల్ మీడియాలో సెన్సేషన్

షాబాద్ ఫొటోలు వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో స్థానిక మున్సిపల్ యంత్రాంగం విఫలమైన చోట, ఈ యువకుడు చూపిన బాధ్యతాయుత ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు అతనికి ‘భివండీ స్పైడర్‌మ్యాన్’ అని పేరు పెట్టి, లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: వాషింగ్ మిషన్ కొంటున్నారా? రూ. 30 వేలలో ఇవే బెస్ట్.. మొండి మరకలైనా మాయం కావాల్సిందే!

Related News

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×