BigTV English

America: విషాదంగా విహారయాత్ర.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

America: విషాదంగా విహారయాత్ర.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

America: అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థులు ఏదో విధంగా అక్కడ మృత్యువాడ పడుతున్నారు. కనిపించని ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా విహారయాత్రకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకి చెందిన 25 ఏళ్ల హరి కిరణ్‌గౌడ్, అక్కడి నుంచి పైలోకాలకు వెళ్లిపోయాడు.


తూర్పు గోదావరి జిల్లాకు 25 ఏళ్ల హరి కిరణ్ గౌడ్ అమెరికా వెళ్లాడు. చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందినవాడు. అక్కడే మిస్సౌరీ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చదువుతున్నాడు. ఓ వైపు చదువుతూనే మరోవైపు పాకెట్ మనీ కోసం పార్టు టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

ఆ టూర్‌లో జలపాతం వద్దకు స్నానానికి వెళ్లాడు. అందులో తన మృత్యువు ఉందని పసి గట్ట లేకపోయాడు. అకస్మాత్తుగా బలమైన ప్రవాహంలో చిక్కుకున్నాడు. హరి కిరణ్‌ను రక్షించేందుకు అతడి స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


ఈ హృదయ విదారక వార్త విని అతని కుటుంబ సభ్యులు, చిక్కల గ్రామవాసులను శోకసంద్రంలో మునిగిపోయారు. హరి కిరణ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నారు హరి కిరణ్ తల్లిదండ్రులు.

ALSO READ: మళ్లీ నోరు జారిన రాజేంద్రుడు.. అడ్డంగా ఇరుక్కున్నట్టే

అవసరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి కుటుంబసభ్యులు స్థానిక అధికారుల ద్వారా అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. హరి కిరణ్ అకాల మరణం అమెరికాలోని తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుని తండ్రి రామకృష్ణ గౌడ్‌ పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నాడు.

కేవలం హరికిరణ్ మాత్రమే కాదు. చాలామంది తెలుగు విద్యార్థులు వీకెండ్‌లో ఫ్రెండ్స్ జలపాతం వద్దకు వెళ్తున్నారు. అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొందరు అక్కడి దుండగుల కాల్పుల్లో మృత్యువాతపడుతున్నారు.  చదువుల పేరు ఏమోగానీ ఏదో విధంగా అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు చనిపోతున్నారు.

Related News

America: అమెరికాలో ఘోరం.. డల్లాస్‌లో భారతీయుడి తల నరికిన దుండగుడు, కారణమేంటి?

Road Accident: బ్రిటన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీలు మృతి, ఏడుగురికి..

America: అమెరికాలో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ దాడి, ఖండించిన భారత్ రాయబార కార్యాలయం

Lord Ram Idol In Canada: నిలువెత్తు శ్రీ రాముడి విగ్రహం.. కెనడాలో అట్టహాసంగా ఆవిష్కరణ!

NATS Event: ఘనంగా ముగిసిన  నాట్స్ 8 వ తెలుగు సంబరాలు..

Rajendra Prasad : పీవీ నరసింహారావు పై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మళ్లీ మాట తూలారా..?

Satish meka tana trustee: విశాఖ నుంచి అమెరికా వరకు.. తానా అధ్యక్షుడిగా సతీష్ మేకా!

Big Stories

×