BigTV English

NATS Event: ఘనంగా ముగిసిన  నాట్స్ 8 వ తెలుగు సంబరాలు..

NATS Event: ఘనంగా ముగిసిన  నాట్స్ 8 వ తెలుగు సంబరాలు..

NATS Event : ఫ్లోరిడాలోని (Florida)టాంపాలో ఎనిమిదవ నాట్స్ ( NATS) తెలుగు సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా ముగిసాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అలాగే వేలాదిమంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మహాసభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, కమిటీ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఇతర మెంబర్లు ఎంతగానో కృషి చేశారని చెప్పాలి. ఈ తెలుగు సంబరాలు కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోలైన బాలకృష్ణ(Balakrishna), విక్టరీ వెంకటేష్ (Venkatesh), అల్లు అర్జున్(Allu Arjun), శ్రీ లీల, జయసుధ వంటి స్టార్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.


ధన్యవాదాలు తెలిపిన గుత్తికొండ శ్రీనివాస్..

ఈ కార్యక్రమంలో భాగంగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, ఎస్ ఎస్ తమన్ వారి మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఎంతో ఉత్సాహపరిచారు. ఇక తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నాట్స్ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక ఈ తెలుగు సంబరాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నాట్స్ కమిటీ కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ (Goothikonda Srinivas)మాట్లాడుతూ.. నాట్స్ తెలుగు సంబరాల కోసం సైనికులలా పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ వేడుకలకు వచ్చిన అతిధులు , కమ్యూనిటీ, కళాకారులకు సహకరించిన వాలంటీర్లు అందరికీ నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ ధన్యవాదాలు కూడా తెలిపారు.


బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళం..

“ఇది మన తెలుగు సంబరం.. జరుపుకుందాం కలిసి అందరం” అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంబరాలలో సుమారు 20వేల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది. తెలుగు వారందరూ కలిసి ఈ వేడుకను ఎంతో సంతోషంగా జరుపుకోవడమే కాకుండా తమకు సామాజిక బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. హైదరాబాద్లోని
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ (Basavatarakam Cancer Hospital)కు నాట్స్ 85 లక్షల రూపాయల విరాళం అందజేస్తూ తమకు సామాజిక బాధ్యత ఉందని కూడా నిరూపించుకున్నారు. అయితే ఈ 85 లక్షల రూపాయలను బసవతారకం హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు నాట్స్ లీడర్ షిప్ అందజేశారు.

జీవిత సాఫల్య పురస్కారం..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర(Vasundhara) కూడా పాల్గొనడంతో వీరిద్దరికీ నాట్స్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు ప్రస్తుతం ఈ నాట్స్ 8 వ సంబరాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Guru Purnima 2025: సద్గురు ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు!

Related News

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Big Stories

×