America: అమెరికాలో దారుణం జరిగింది. డల్లాస్‌లో భారత సంతతి కి చెందిన ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. భారతయుడ్ని పబ్లిక్‌గా చంపడానికి కారణాలేంటి? అమెరికాలో భారతీయులు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
అమెరికాలో ఉంటున్న భారతీయులు, ఎన్నారైలకు కొత్త టెన్షన్. కారణాలు ఏమైనా కావచ్చు.. పబ్లిక్‌గా దుండగుడు ఓ భారతీయుడ్ని తల నరికిన వ్యవహారంపై బెంబేలెత్తు తున్నారు. అమెరికాలోని డాలస్ సిటీలో ఓ మోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న నాగమల్లయ్య చంద్రమౌళి. ఆయన వయస్సు 50 ఏల్లు. చంద్రమౌళి వద్ద మార్టినెజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
అయితే బుధవారం చంద్రమౌళి-మార్టినెజ్‌ల మధ్య చిన్న వివాదం నెలకొంది. మార్టినెజ్ మోటల్‌లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించవద్దని అతడికి చంద్రమౌళి వివరించారు. ఈ విషయాన్ని చంద్రమౌళి నేరుగా చెప్పకుండా మరో ఉద్యోగితో చెప్పించాడు. అదే మార్టినెజ్ ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో ఇరువురు మధ్య వివాదం గాలివానగా మారింది.
ఆవేశానికి లోనయ్యాడు మార్టినెజ్. ఈ నేపథ్యంలో తనదగ్గరున్న కత్తిని బయటకు తీసి చంద్రమౌళిపై దాడికి తెగబడ్డాడు. పరిస్థితి గమనించిన చంద్రమౌళి ప్రాణభయంతో మోటెల్ పార్కింగ్ స్థలంలోకి పరుగులు తీశాడు. అయినా మార్టినెజ్ వదలకుండా వెంటాడాడు. చంద్రమౌళి అరుపులు విని ఆయన భార్య, కొడుకు కాపాడేందుకు ప్రయత్నించారు.
ALSO READ: బ్రిటన్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీలు మృతి
నిందితుడు వారిని పక్కకు తోసేసి చంద్రమౌళి తల నరికేశాడు. తెగిపడిన తలను రెండుసార్లు కాలితో తన్నాడు. అప్పటివరకు మార్టినెజ్ పగ తీరలేదు. ఆ తలను చెత్తకుండీలో పడేసే ప్రయత్నం చేశాడు. రక్తం మరకలతో ఉన్న నిందితుడ్ని గమనించి అగ్నిమాపక సిబ్బంది సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు మార్టినెజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చంద్రమౌళిని తాను కత్తితో చంపినట్లు నిందితుడు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీన్ రిక్రియేట్ చేసే పనిలో పడ్డారు. ఈ హత్యపై భారత కాన్సులేట్ రియాక్ట్ అయ్యింది. చంద్రమౌళి హత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని రాసుకొచ్చింది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బాధిత కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
సెప్టెంబర్ 10న ఈ ఘటన జరిగింది. నిందితుడు మార్టినెజ్ వయస్సు 37 ఏళ్లు. మార్టినెజ్‌కు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నేర చరిత్ర ఉందని అధికారులు వెల్లడించారు. గతంలో ఫ్లోరిడాలో ఆటో దొంగతనం, హూస్టన్‌లో ఒక పిల్లవాడిపై దాడి అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఘటన తరువాత పని చేసే ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
Consulate General of India, Houston, condoles the tragic death of Mr. Chandra Nagamallaiah, an Indian National, killed brutally at his workplace in Dallas, Tx.
We are in touch with the family and offering all possible assistance. The accused is in the custody of Dallas Police.…
— India in Houston (@cgihou) September 11, 2025
https://twitter.com/bigtvtelugu/status/1966356820416754036