Akash Deep: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్ పై ఏకంగా 336 పరుగుల తేడాతో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా… బుమ్రా లేకపోయినా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.. ఆకాష్ దీప్ అద్భుతమైన బౌలింగ్… కారణంగానే టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 10 వికెట్లు తీసి.. అదరగొట్టాడు. అయితే అలాంటి ఆకాష్ దీప్… కుటుంబంలో అన్ని కష్టాలే ఉన్నాయి. అతని సోదరి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇటు ఇంట్లో గొడవని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియాలో చోటు దక్కించుకొని అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఆకాష్ దీప్. దీంతో సోషల్ మీడియాలో ఆకాష్ గురించి బాగా సెర్చ్ చేస్తున్నారు జనాలు.
Also Read: Team India: పెళ్ళైన టీమిండియా క్రికెటర్ తో తెగించిన తెలుగు హీరోయిన్.. అడ్డంగా దొరికిందిగా !
సోదరికి క్యాన్సర్.. ఆకాష్ దీప్ కీలక ప్రకటన
ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో టీమిండియా యంగ్ బౌలర్ ఆకాష్ దీప్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. బుమ్రా… లేకపోయినా కూడా అతని పాత్రను ఆకాష్ దీప్ చాలా సమర్థవంతంగా పోషించాడు. ఇంగ్లాండు తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 10 వికెట్లు తీసి టీమిండియా కు… హిస్టారికల్ విజయాన్ని అందించాడు. అయితే ఈ విజయం అనంతరం… టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కీలక ప్రకటన చేశారు. తన సోదరి భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ అద్భుతమైన విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు.. అందరి హృదయాలను గెలుచుకున్నాడు ఆకాష్ దీప్.
ఇంతకు ఎవరి ఆకాష్ దీప్?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్.. సొంత రాష్ట్రం బీహార్. 1996 సంవత్సరం డిసెంబర్ 15 న జన్మించాడు. అంటే ప్రస్తుతం అతని వయసు 28 సంవత్సరాలు మాత్రమే. ఇక టెస్ట్ క్రికెట్ అరంగేట్రం 2024 లోనే చేశాడు. అది కూడా ఇంగ్లాండ్ జట్టు పైన కావడం విశేషం. అయితే ఆకాష్ దీప్ చదువుకునే సమయంలో… ఆయన తండ్రి అనేక కోరికలు కోరుకునేవాడు. ఎలాగైనా తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. కానీ… క్రికెట్ పైన ఆసక్తి పెంచుకొని.. అటువైపు ఆకాష్ దీప్ అడుగులు వేశారు.
అంతేకాదు.. చదువు పూర్తయిన తర్వాత దుర్గాపూర్ లోని ఓ క్రికెట్ క్లబ్లో కూడా చేరాడు. అక్కడ క్రికెట్ ఆడి రోజుకు 800 రూపాయలు సంపాదించేవాడు ఆకాష్. ఈ నేపథ్యంలోనే నెలకు 25000 సంపాదించేవాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడడమే కాకుండా… టీమిండియాలోకి కూడా వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే లక్నో సూపర్ జెంట్స్ జట్టు తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇప్పుడు టీమిండియాలో అదరగొడుతున్నాడు.
Also Read: ENG vs IND, 2nd Test: టీమిండియాకు అన్యాయం.. 10 ఓవర్ల కోత… గిల్ కెప్టెన్సీపై ట్రోలింగ్ !
గంభీర్ కు వార్నింగ్
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో… తనకు మొదటి టెస్ట్ మ్యాచ్లో అవకాశం రాలేదని కాస్త ఘాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆకాష్ దీప్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ గంభీర్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కానీ రెండో టెస్టులో మాత్రం ఆకాష్ కు అవకాశం రావడంతో సద్వినియోగం చేసుకున్నాడు.
?igsh=M3Jza3VtcWM2a3Ru