Tallest Lord Ram Idol In Canada: ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. కెనడాలోని మిస్సిస్సాగాలో హిందూ హెరిటేజ్ సెంటర్ ప్రాంగణంలో వేలాది మంది హిందువుల కరతాళ ధ్వనులు, పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. కెనడా మంత్రులు రేచి వాల్డెజ్, షఫ్కత్ అలీ, మనిందర్ సిధు లాంటి రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 51 అడుగుల ఎత్తున్న ఈ ఫైబర్‌గ్లాస్ విగ్రహం ఇప్పుడు టొరంటో ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా మారబోతోంది.
51 అడుగుల విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు
అద్భుతమైన 51 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేశారు. శిల్పకళలో నిష్ణాతులైన కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. అనంతరం కెనడాలోని టొరంటో నగరానికి సమీపంలో ఉన్న మిస్సిస్సాగా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే హిందూ హెరిటేజ్ సెంటర్ లో ప్రతిష్టించారు. ఫైబర్ గ్లాస్ తో నిర్మితమైన ఈ విగ్రహం 200 కిలో మీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుంటుంది. కనీసం వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే దీపస్తంభం
ఈ విగ్రహ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులకు ఓ శుభ పరిణామం అని హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకులు ఆచార్య సురిందర్ శర్మ తెలిపారు. ఇది కేవలం ఒక ప్రతిష్ట కార్యక్రమమే కాదు, సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే దీపస్తంభంగా కొనియాడారు. శ్రీరాముడు ధర్మాన్ని నిలిపినవాడని చెప్పిన ఆయన, అతడిని నిత్యం పునఃస్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయులంతా ఏకతాటిపై రావాలన్న సంకల్పంతో, భక్తి, సాంస్కృతిక విలువలకు నిలయంగా ఉండేలా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు కుశాగ్ర్ శర్మ వెల్లడించారు. ఈ విగ్రహం మతానికి మాత్రమే కాదు, సామాజిక ఐక్యతకు, శాంతికి ప్రతీక అన్నారు.
📍Toronto, Canada
The tallest 51-ft Murti of Bhagwan Shri Ram😍 in North America has been inaugurated at Shri Swaminarayan Mandir, Mississauga a powerful symbol of Sanatan Dharma’s growing global presence ✊🏻🕉️
Jai Sree Ram 🏹🙇
— Cosmoshiv 🚩 (@TrinetraWrath) August 4, 2025
టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో..
శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టించబడిన స్థలం, టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండడంతో, అక్కడ దిగే ప్రతి ప్రయాణికుడికీ భూలోక వైకుంఠంలా కనిపించనుంది. కెనడాలో అడుగుపెట్టే భారతీయులకూ, స్థానిక హిందూ సమాజానికీ ఇది మరో అయోధ్యలా మారనుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో సోషల్ మీడియాలో హిందువులు సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్య నుంచి టొరంటో వరకు రామ నామ ధ్వని ప్రతిధ్వనిస్తోందన్నారు. ఇది కేవలం విగ్రహం కాదు, ధర్మానికి, సమూహ శక్తికి, భక్తికి నిలువెత్తు సంకేతం అంటున్నారు. సనాతనధర్మ సమాజానికి ఇదో గర్వకారణమని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీరాముడి వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విగ్రహం భారతీయ సంస్కృతిక శక్తిగా, ధర్మ ప్రేరణగా, విశ్వ ఐక్యతకు పునాదిగా నిలువబోతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు.
Mississauga Unveils North America’s Tallest Lord Ram Statue in Grand Ceremony: In a historic and spiritually significant event, the tallest statue of Lord Ram in North America was unveiled on August 4, 2025, at the Hindu Heritage Centre in Mississauga,… https://t.co/PMJjFZAAVQ pic.twitter.com/SlrIk7UdVZ
— Weekly Voice (@Weeklyvoice) August 5, 2025
Read Also: నేరుగా రైలు సీటు దగ్గరికే రాఖీలు, ఐడియా అదిరింది గురూ!