BigTV English

America: అమెరికాలో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ దాడి, ఖండించిన భారత్ రాయబార కార్యాలయం

America: అమెరికాలో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ దాడి, ఖండించిన  భారత్ రాయబార కార్యాలయం

America: ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలో నెవార్క్ సిటీలో శ్రీ స్వామినారాయణ్ హిందూ దేవాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆలయం బయట గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఖలిస్థానీ ఉగ్రవాది భింద్రాన్‌వాలేను పొగుడుతూ స్ప్రే పెయింట్‌తో రాసుకొచ్చారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ విధంగా చేయడంతో స్థానిక హిందూ సమాజంలో ఆందోళన మొదలైంది.


తమను ఏమైనా చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే గోడపై రాతలను గుర్తించిన ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన నెవార్క్ పోలీసులు, విధ్వంసం మాదిరిగా కాకుండా ఉద్దేశ పూర్వకంగా లక్ష్యం చేసుకుని చేసిన దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టినట్టు అధికారులు క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు ఈ దాడిని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఖండించింది. ఈ వ్యవహారంపై అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని పేర్కొంది.


అమెరికాలో హిందూ దేవాలయాలపై ఈ ఏడాదిలో ఈ విధంగా జరగడం ఇది నాలుగోసారి. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా హిందూ అమెరికన్ ఫౌండేషన్-HAF షేర్ చేసింది. దేవాలయాలపై ఈ విధంగా రాతలు రాయడం ఖలిస్తాన్ అనుకూల వాదులు తరచూ ఉపయోగించే వ్యూహంలో భాగమని అంటున్నారు.

ALSO READ: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు

ఏడాది కాలంగా అమెరికాలోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల పరంపరలో ఇది కూడా ఒకటి. గతేడాది మార్చి లో దక్షిణ కాలిఫోర్నియాలో ఐకానిక్ ఆలయంపై పైవిధంగా రాతలు రాయడంతో భారత ప్రభుత్వం ఖండించింది. నీచమైన చర్యగా విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.

రెండేళ్ల కిందట అంటే 2023 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలోని BAPS ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలతో రాసుకొచ్చారు. ఇది జరిగి కేవలం తొమ్మిది రోజుల తర్వాత సాక్రమెంటో సమీపంలోని మరొక ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని న్యూవార్క్ BAPS ఆలయంపై దాడి చేసిన విషయం తెల్సిందే.

 

Related News

Lord Ram Idol In Canada: నిలువెత్తు శ్రీ రాముడి విగ్రహం.. కెనడాలో అట్టహాసంగా ఆవిష్కరణ!

NATS Event: ఘనంగా ముగిసిన  నాట్స్ 8 వ తెలుగు సంబరాలు..

America: విషాదంగా విహారయాత్ర.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Rajendra Prasad : పీవీ నరసింహారావు పై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. మళ్లీ మాట తూలారా..?

Satish meka tana trustee: విశాఖ నుంచి అమెరికా వరకు.. తానా అధ్యక్షుడిగా సతీష్ మేకా!

Big Stories

×