Rajendra Prasad : టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ ఈ మధ్య ఏం మాట్లాడినా కూడా ఆయన మెడకే చుట్టుకుంటుంది. మొన్నేమో ఆలీ ని బూతులు తిట్టాడు. ఇప్పుడు మరోసారి నోరు సారి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండానే మాట్లాడేస్తున్నాడు. కొన్ని పదాలు అభ్యంతరంగా ఉండడంతో ఆయనపై ట్రోల్స్ వస్తున్నాయి. ఒకవైపు నెట్టింట వ్యతిరేకత ఉన్నా కూడా ఆయన మాట దొర్లకుండా ఉండలేకున్నాడు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కార్యక్రమం వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి నెటిజన్స్ ట్రోల్స్ కు గురయ్యాడు.
మళ్లీ మాట తూలిన రాజేంద్రుడు..
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఈమధ్య వరుస వివాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. మొన్న ఈ మధ్య డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ హాస్యనటుడు ఆలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతులు తిట్టారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయన ఈ మధ్య వరుసగా నటులపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు ట్రోల్స్ వస్తున్న సరే ఆయన మాట్లాడే తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి నోరు జారి అడ్డంగా ఇరుక్కున్నాడు.
ప్రస్తుతంఅమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తనను తాను పొగుడుకునే క్రమంలో మళ్ళీ పొరపాట్లు చేయడం మరోసారి హాట్ టాపికయ్యింది. కాకపోతే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండటం విశేషం. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు ప్రస్తావన తెచ్చిన రాజేంద్రప్రసాద్ ఆయన కేసులు, సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే స్వాంతన పొందేవారని చెప్పడం అందరిని షాక్ కు గురి చేసింది.. గతంలో దివంగత సి నారాయణరెడ్డిగారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం, కంచం లాగా రాజేంద్రప్రసాద్ ఉంటాడని గర్వంగా చెప్పడం కొంచెం సోత్కర్షగానే అనిపించింది. ఈవెంట్ లో ఆయన మాట్లాడిన ప్రతి మాట తెలుగు ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.
వయసు పెరిగింది.. బుద్ధి లేదా..?
సినిమాల పరంగా గాని, ఫ్యామిలీ పరంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నటుడిగా, తన సత్తాని చాటుతూ వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు రాజేంద్రప్రసాద్. ఈమధ్య ఈయన ఏ ఈవెంట్ కి వెళ్ళినా అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెట్టింటాల్స్ కి గురవుతుంటాడు. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఈవెంట్ లో కూడా అలానే నోరు జారి మాట్లాడటం కొందరికి ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. అంత పెద్ద వేదిక మీద ఇలాంటి స్పీచ్ ఇవ్వడం మీద సర్వత్రా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వయసు పెరిగింది గాని, బుద్ధి మాత్రం మందగించింది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఇబ్బందికరంగా ఉందంటూ పలువురు కామెంట్లతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఆయన ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి.. వయసు పై పడుతున్న నటనపై ఆయన ఆసక్తి మాత్రం ఆయనకు తగ్గలేదు. ఈ వయసులో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు రాజేంద్రప్రసాద్. ఎన్నో క్లాసిక్స్ ఇండస్ట్రీకి అందించిన మాట వాస్తవమే కానీ అవి లేకపోతే పరిశ్రమ ఏమైపోయేదో అన్న రేంజ్ లో చెప్పుకోవడం సరికాదు. మొత్తానికి ఈయన మరోసారి నెటిజన్లకు పని పెట్టాడు. ఈసారి ఈయన మాట్లాడిన మాటలు ఎన్ని వివాదాలకు దారి తీస్తాయో చూడాలి..