OTT Movie : కామెడీ కంటెంట్ తో వచ్చిన ఒక అమెరికన్ టెలివిజన్ సిరీస్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇది చివరి వరకు సరదాగా సాగిపోతూ, కడుపుబ్బ నవ్విస్తుంది. ఇది ఒక కాలేజీలో విభిన్న వ్యక్తుల సమూహం చుట్టూ తిరుగుతుంది. ఈ కామిడీ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
సోనీ లివ్ (sonyliv) లో
ఈ అమెరికన్ సిట్‌కామ్ టెలివిజన్ సిరీస్ పేరు ‘కమ్యూనిటీ’ (Community). 2009 లో వచ్చిన దీనిని డాన్ హార్మన్ రూపొందించారు. ఈ సిరీస్ ఆరు సీజన్లలో 110 ఎపిసోడ్‌ల వరకు నడిచింది. మొదటి ఐదు సీజన్‌లు సెప్టెంబర్ 17, 2009 నుండి ఏప్రిల్ 17, 2014 వరకు NBCలో ప్రసారం చేయబడ్డాయి. చివరి సీజన్ Yahoo!లో ప్రసారం చేయబడింది. కొలరాడో పట్టణంలోని గ్రీన్‌డేల్‌లోని ఒక కమ్యూనిటీ కళాశాలలో ఈ స్టోరీ జరుగుతుంది. ఇది విభిన్నమైన విద్యార్థుల సమూహం చుట్టూ తిరుగుతుంది. ఇందులో జోయెల్ మెక్‌హేల్, గిలియన్ జాకబ్స్, డానీ పూడి, యెవెట్ నికోల్ బ్రౌన్, అలిసన్ బ్రీ, డోనాల్డ్, ఛీమ్‌ష్ గ్లోవర్ నటించారు. ప్రతి ఎపిసోడ్ హర్మాన్ ‘స్టడీ సర్కిల్’ కి అనుగుణంగా తెరకక్కించారు. ఈ సిరీస్ సోనీ లివ్ (sonyliv) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జెఫ్ వింగర్ ఒక న్యాయవాదిగా ఉండేవాడు. అయితే అతను తన నకిలీ డిగ్రీతో ఈ వృత్తి లోకి వెళతాడు. ఇది బయటికి తెలియడంతో అతనిని న్యాయవాదిగా తొలగిస్తారు. ఇప్పుడు జెఫ్ వింగర్ తిరిగి చదువు ప్రారంభించాల్సి వస్తుంది. అతను చదువు నిమిత్తం గ్రీన్‌డేల్ కమ్యూనిటీ కాలేజీలో చేరతాడు. అక్కడ అతను తన స్పానిష్ క్లాస్‌లో సహాయం కోసం ఒక స్టడీ గ్రూప్‌ను సృష్టిస్తాడు. అయితే ఈ గ్రూప్ త్వరలోనే అతని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. బ్రిట్టా పెర్రీ – సామాజిక కార్యకర్తగా ఉండే ఒక స్వతంత్ర మహిళ, జెఫ్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అబెడ్ నాదిర్ – సినిమా, టీవీ గురించి ఎన్సైక్లోపీడియా జ్ఞానం కలిగిన ఒక విచిత్రమైన విద్యార్థి, సామాజిక అంశాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాడు. షిర్లీ బెన్నెట్ – ఒక గృహిణి గా ఉంటూ, ఆమె తన జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవడానికి కాలేజీకి వస్తుంది.
ఆనీ ఎడిసన్ – ఈమె అందరికీ ఆదర్శవంతంగా ఉండే విద్యార్థి. ట్రాయ్ బార్న్స్ – ఒక మాజీ హైస్కూల్ ఫుట్‌బాల్ స్టార్, అతను తన గుర్తింపును మెరుగుపరచుకోవడానికి ఇక్కడికి వస్తాడు. పియర్స్ హాథోర్న్ – ఒక వృద్ధ ధనవంతుడైన ఇతను తరచూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఈ స్టడీ గ్రూప్ లో కాలక్రమేణా, ఈ విభిన్న వ్యక్తుల సమూహం జెఫ్ కి సన్నిహితులుగా మారతారు. వీళ్ళంతా కాలేజీ జీవితంలోని విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఒకసారి బ్రిట్టా, జెఫ్ ను ముద్దుపెట్టుకుని, అందరిముందు వెర్రివాన్ని చేస్తుంది. ఇలాంటి ఘటనలతో ఇందులో విపరీతమైన గందరగోళాలు ఏర్పడతాయి. ఈ సంఘటనల ద్వారా వారి స్నేహం బలపడి, వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. చివరి వరకు ఈ సిరీస్ నవ్విస్తూ సరదాగా సాగిపోతుంది.