BigTV English

Brahmamudi Serial Today April 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: స్వప్న ప్లాన్‌ సక్సెస్‌ – పూల్స్‌ అయిన రుద్రాణి, రాహుల్‌

Brahmamudi Serial Today April 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్: స్వప్న ప్లాన్‌ సక్సెస్‌ – పూల్స్‌ అయిన రుద్రాణి, రాహుల్‌

Brahmamudi serial today Episode: డైనింగ్‌ టేబుల్‌ దగ్గర రుద్రాణిని పిచ్చిదాన్ని చేయాలని అప్పు, స్వప్న ప్లాన్‌ చేస్తారు. అందుకోసం రుద్రాణి రావడానికి ముందే టేబుల్‌ మీద పచ్చి చేపలు, ఉడికించని చికెన్ పెడతారు. రుద్రాణి వచ్చి కర్రీలు చేయకుండా ఇలా పచ్చిగా పెట్టారేంటి అని తిడుతుంది. దీంతో అప్పు, స్వప్న ఇద్దరూ ఇంత మంచి కూరలు ఉండగా పచ్చివి ఉన్నావేంటి అంటావేంటి.. నీకేమైనా పిచ్చి పట్టిందా..? అంటారు. దీంతో రుద్రాణి కోసం ఇద్దరినీ తిడుతుంది. దీంతో అప్పు అయ్యో రుద్రాణి గారు అందరినీ పిచ్చోళ్లను చేయాలనే పిచ్చితో మీకు పిచ్చి బాగా ముదిరినట్టు ఉంది. అంటుంది. స్వప్న కూడా అత్తగారు మిమ్మల్ని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. మా ఆయన ఎక్కడికి వెళ్లారో ఏంటో.. అంటుంది.


ఇంతలో రుద్రాణి కోపంగా అక్కడి నుంచి హాల్లోకి వెళ్లి చిన్నన్నయ్యా ధాన్యలక్ష్మీ మీరు ఇటు రండి అని పిలుస్తుంది. అంటూ ఇద్దరినీ తీసుకుని డైనింగ్‌ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. వీళ్లిద్దరూ కలిసి నన్ను వెధవను చేయాలని చూస్తున్నారు అంటుంది. దీంతో ప్రకాష్‌ నిన్ను ప్రత్యేకంగా చేయాలా..? పది నిమిషాలు నీతో ఎవరు మాట్లాడినా..? అర్థం అయిపోతుంది కదా.. సరే విషయం ఏంటో చెప్పు అని అడగ్గానే.. స్వప్న ఇక్కడ చికెన్‌, ఫిష్‌, బంగాళాదుంప మంచి కర్రీస్‌ చేస్తే ఈవిడ గారి కళ్లకు పచ్చిగా కనిపిస్తున్నాయంట..? అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ కూడా ఈ మధ్య రుద్రాణికి మైండ్‌ సరిగ్గా పనిచేయడం లేదులే అంటుంది. దీంతో రుద్రాణి కోపంగా ధాన్యలక్ష్మీ నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా..? కావాలంటే మీరే చూడండి.. పచ్చి మాంసం, పచ్చి కూరలు పెట్టి ప్రై పులుసు అంటూ మాట్లాడుతున్నారు అంటుంది. వెంటనే ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ చూడగానే అక్కడ నిజంగానే ఘుమఘుమ లాడే వంటలు ఉంటాయి.  అవి చూసిన ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతారు. కావ్యతో పాటు మమ్మల్ని పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నావా..? అంటూ తిడతారు.

తర్వాత కావ్య కిచెన్‌లోకి వెళ్తూ హాల్లో ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుంది. ఇంతలో కావ్యకు రాజ్‌ ఫోన్‌ చేస్తాడు. అప్పుడే  అక్కడికి వచ్చిన అపర్ణ కావ్యకు ఫోన్‌ రింగ్‌ అవుతుందని చెప్తుంది. కావ్య ఎవరో చూడండి అత్తయ్యా అని చెప్తుంది. అపర్ణ వెళ్లి చూడబోతుంటే..వెంటనే కావ్య ఒకవేళ ఆయన గానీ ఫోన్‌ చేస్తున్నారా..? ఏంటి అత్తయ్య గారు చూశారంటే కొంపలు అంటుకుంటాయి. అని పరుగెత్తుకెళ్లి నేను చూస్తాను అత్తయ్యా అంటూ ఫోన్‌ తీసుకుని కట్‌ చేస్తుంది. అపర్ణ ఫోన్‌ రింగ్‌ అవుతుంది కదా ఎత్తి మాట్లాడొచ్చు కదా అంటుంది. దీంతో కావ్య ఆఫీసును నుంచి వస్తుంది అత్తయ్యా తర్వాత నేను చేస్తాను అని చెప్తుంది. మళ్లీ రాజ్‌ కాల్‌ చేయగానే.. అపర్ణ ఏదో ముఖ్యమైన విషయం అయుంటుంది. లిఫ్ట్‌ చేసి మాట్లాడు అంటుంది. దీంతో కావ్య కాల్‌ లిఫ్ట్‌ చేసి హలో శ్రుతి చెప్పు అంటుంది.  రాజ్‌ కన్పీజ్‌గా శ్రుతి ఎవరండి నేను రామ్‌ను మాట్లాడుతున్నాను అంటాడు.


కావ్య మాత్రం ఓ రమ్య నువ్వా చెప్పు రమ్య అంటుంది. రాజ్‌ మాత్రం రమ్య కాదండి రామ్‌.. నా గొంతు మరీ అమ్మాయి వాయిస్‌ లా ఉందా.? అంటాడు. కావ్య ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది అత్తయ్యా నేను పైకి వెళ్లి మాట్లాడి వస్తాను అంటూ పైకి వెళ్తుంది. హలో కళావతి గారు నేను రమ్యను కాదండి  రామ్‌ను మాట్లాడుతున్నాను.. అబ్బాయిని అంటాడు. దీంతో కావ్య అయ్యో తెలుసండి.. అంటుంది. దీంతో రాజ్‌ మరీ ఇందాకటి నుంచి శ్రుతి, రమ్య అంటూ అమ్మాయిల పేర్లతో పిలుస్తారేంటండి అనగానే కావ్య నేను కూడా ఒక అమ్మాయినే కదండి. ఇలా అబ్బాయితే మాట్లాడుతున్నాను అని తెలిస్తే మా ఇంట్లో  వాళ్లు ఏమనుకుంటారో చెప్పండి. అనగానే సారీ నేను అది ఆలోచించలేకపోయాను అంటాడు.

ఏలా ఆలోచిస్తారు మీరు అబ్బాయి కదా..? మా అమ్మాయిలా ఒక్కరోజు ఉంటే మా కష్టాలు తెలుస్తాయి. అనగానే.. చెప్తే నేను అర్థం చేసుకుంటాను అని చెప్తాడు. సరే ముందు నన్ను ఎందుకు గుర్తు చేసుకున్నారో చెప్పండి అని అడుగుతుంది. దీంతో రాజ్‌ హెడేక్‌ అన్నారు కదా ఎలా ఉందో తెలుసుకుందామని  కాల్ చేశాను అంటాడు. దీంతో కావ్య నాకు వచ్చింది హర్ట్‌ స్ట్రోక్‌ కాదండి.. హెడేక్‌ అంతే కొంపదీసి ఇప్పుడొచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారా ఏంటి..? అంటుంది. దీంతో అంత లేదులే కానీ నా దగ్గర మంచి చిట్కా ఉంది అది ఫాలో అవండి హెడేక్‌ తగ్గిపోతుంది అంటాడు. రాజ్‌ చెప్పినట్టు చేస్తూ.. రాజ్‌ వచ్చి తనకు మర్ధన చేసినట్టు ఫీలవుతుంది కావ్య.

టీనా కోసం బయటకు వెళ్లిన రాహుల్‌ స్వప్నకు ఫోన్‌ చేసి టీనా ఐదు గంటల నుంచి అక్కడా ఇక్కడా అంటున్నావు కానీ ఇంకా ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అయితే ఇప్పుడు కరెక్టు అడ్రస్‌ చెప్తాను వచ్చేయ్‌ అని ఫోన్‌ లో తమ ఇంటి రూట్‌ చెప్తుంది. రాహుల్ హ్యాపీగా వచ్చి ఇల్లు చూసి షాక్‌ అవుతాడు. స్వప్న వచ్చి రాహుల్ కు నిజం చెప్పి చీపురుతో కొడుతుంది. ఇంతలో రుద్రాని వచ్చి తన బాధను రాహుల్ కు చెప్పుకుంటుంది. దీంతో రాహుల్‌ మన ఇద్దరి జీవితాలు వాడేసిన టిష్యూ పేపర్‌ లా తయారయ్యాయి మామ్‌ అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×