E-Paper
Advertisement

D/O Prasad Rao Kanabadutaledhu OTT : తప్పిపోయిన కూతురి కోసం తండ్రి పోరాటం… రాజీవ్ కనకాల కొత్త సిరీస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

D/O Prasad Rao Kanabadutaledhu OTT : తప్పిపోయిన కూతురి కోసం తండ్రి పోరాటం… రాజీవ్ కనకాల కొత్త సిరీస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

D/O Prasad Rao Kanabadutaledhu OTT : ఓటీటీలోకి మరో ఆసక్తికరమైన తెలుగు వెబ్ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజైంది. రాజీవ్ కనకాల ప్రసాద్ రావు రోల్ లో తండ్రి పాత్ర పోషిస్తుండగా, యాంకర్ ఉదయభాను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. స్వాతి అనే అమ్మాయి మిస్సింగ్ చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది. మరి ఈ సిరీస్ పేరు , ఏ ఓటీటీలోకి రానుంది ? అనే విషయాలను తెలుసుకుందాం.

జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ ఫామ్ లో స్ట్రీమింగ్

పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘D/o ప్రసాద్ రావు కనబడుటలేదు’ (D/o Prasad Rao Kanabadutaledhu). ఫిబ్రవరి 27 నుంచి ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్య జీ5 ఎక్కువగా సౌత్ మార్కెట్‌ కంటెంట్‌ను ఎక్కువగా అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ని కూడా తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో రాజీవ్ కనకాల, యాంకర్ ఉదయభానుతో పాటు వసంతిక, గాయత్రి భార్గవి, బిందు మౌళి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

కథేంటంటే..

Advertisement

ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) ఒక మధ్యతరగతి తండ్రి. అతనికి కుమార్తె స్వాతి (వసంతిక) అంటే ప్రాణం. కానీ ఒకరోజు అకస్మాత్తుగా స్వాతి కనిపించకుండా పోతుంది. కన్నకూతురు ఏమైందో తెలియక, ఎక్కడుందో అర్థం కాక ఆ తండ్రి పడే ఆవేదన, ఆరాటం గుండెల్ని పిండేసేలా ఉంటుంది. పోలీసులు వెతకడం మొదలుపెట్టాక, ఈ మిస్సింగ్ కేసు వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ (ఉదయభాను) విచారణలో ప్రసాద్ రావు కుటుంబానికి సంబంధించిన కొన్ని పాత సీక్రెట్స్ కూడా బయటకు వస్తాయి. స్వాతి నిజంగానే కిడ్నాప్ అయిందా ? ఎవరికీ తెలియకుండా తనే వెళ్ళిపోయిందా? ఈ క్రమంలో ప్రసాద్ రావుకి ఎదురైన చేదు నిజాలు ఏంటి? చివరికి ఆ తండ్రి తన కూతురిని క్షేమంగా కలుసుకున్నాడా ? అనేదే ఈ సిరీస్ లోని అసలు సస్పెన్స్.

Read Also ; ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ ఫాంటసీ యానిమేటెడ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tags

Related News

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×