E-Paper
Advertisement

ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే ఇలా స్పేస్ పెంచుకోండి!

ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండానే ఇలా స్పేస్ పెంచుకోండి!
Advertisement

iPhone Storage Tips: ఐఫోన్ యూజర్లకు తరచూ చిరాకు తెప్పించే సమస్యల్లో స్టోరేజ్ ఫుల్ అవడం ఒకటి. ఫోన్‌లో స్పేస్ అయిపోయిందంటూ నోటిఫికేషన్ కనిపించగానే.. కొత్త ఫొటోలు, వీడియోలు సేవ్ కాకపోవడం, మెయిల్స్ రావడంలో ఇబ్బందులు ఇలా ఒక్కొక్కటిగా సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా మన ఫోన్‌లో ఎక్కువ స్టోరేజ్‌ను ఫొటోలు, వీడియోలే ఆక్రమిస్తుంటాయి. వాటిని డిలీట్ చేయాలంటే ఇష్టమైన జ్ఞాపకాలను వదులుకోవాల్సి వస్తుందేమోనని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయకుండానే ఐఫోన్‌లో విలువైన స్టోరేజ్‌ను ఖాళీ చేసుకునే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సమస్య ఎక్కడుందో చూడాలి..

ఏది పడితే అది డిలీట్ చేయడం కంటే.. ముందుగా ఐఫోన్‌లో ఎక్కువ స్పేస్‌ను ఏది తీసుకుంటుందో తెలుసుకోవాలి. దీని కోసం Settings > General > iPhone Storageలోకి వెళ్లండి. అక్కడ ఫొటోలు, యాప్స్, డాక్యుమెంట్స్ తదితరాలు ఎంత స్టోరేజ్ తీసుకుంటున్నాయో కనిపిస్తుంది. సమస్య ఎక్కడుందో తెలిస్తే.. దానికి తగ్గట్టు క్లియర్ చేయడం సులభం.

iCloudతో ఫొటోలకు స్పేస్ ఆదా..

Advertisement

ఫొటోలు ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంటే క్లౌడ్ ఉపయోగపడుతుంది. Settings > మీ పేరు > iCloud > Photosలోకి వెళ్లి Sync this iPhone ఆన్ చేసి, Optimize iPhone Storage ఎంచుకోండి. దీంతో ఒరిజినల్ ఫొటోలు క్లౌడ్‌లో భద్రంగా ఉంటాయి. ఐఫోన్‌లో మాత్రం అవసరమైనంత తక్కువ సైజ్ వెర్షన్ ఉంటుంది. అయితే ఐక్లౌడ్ స్టోరేజ్‌కు మీ ప్లాన్‌లో తగినంత స్పేస్ ఉండాలి.

Also Read: రోజూ 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ.. Jio కొత్త రీఛార్జ్ ప్లాన్ చూశారా?

డూప్లికేట్స్‌ను తొలగించడం:

Advertisement

ఒకే ఫొటోను పలుమార్లు సేవ్ చేయడం వల్ల తెలియకుండానే చాలా స్పేస్ పోతుంది. ఫొటోస్ యాప్‌లో Collections > Utilities > Duplicatesలోకి వెళ్లి ఒకేలా ఉన్న ఫొటోలను చెక్ చేయండి. అవసరం లేని కాపీలను మెర్జ్ చేస్తే.. బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫొటో మిగిలి, డూప్లికేట్స్ తొలగిపోతాయి.

వాడని యాప్స్‌ను తీసేయడం:

ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించే పెద్ద యాప్స్, గేమ్స్ కూడా భారీగా స్పేస్ తీసుకుంటాయి. Settings > General > iPhone Storageలోకి వెళ్లి అవసరం లేని యాప్‌ను ఎంచుకుని Offload Appపై ట్యాప్ చేయండి. యాప్ తొలగిపోయినా దాని డేటా అలాగే ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఫొటోలను బ్యాకప్ చేయడం:

ఐక్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఇష్టం లేకపోతే.. పాత ఫొటోలు, వీడియోలను కంప్యూటర్ లేదా ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవచ్చు. బ్యాకప్ సరిగ్గా ఉందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఐఫోన్‌లోని పాత ఫైళ్లను తొలగించండి. ఇలా ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటే స్టోరేజ్ సమస్య కూడా తరచూ రాదు.

Also Read: యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

Tags

Related News

రోజూ 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ ఫ్రీ.. Jio కొత్త రీఛార్జ్ ప్లాన్ చూశారా?

యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!

ఇంటి మొత్తానికి ఒకే ప్లాన్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, ప్రైమ్.. 5G డేటా, 5 సిమ్‌లు ఉచితం!

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

Big Stories

Advertisement
×