Vishwambhara OTT Deal: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ట మల్లిడి (Vasistha mallidi) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం విశ్వంభర (Vishwambhara) . ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అప్పుడు ఇప్పుడు అంటూ గత మూడేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఓటీటీ డీల్ ఖరారు అయింది. విడుదలకు లైన్ క్లియర్ అంటూ వస్తున్న వార్తలు కూడా అవాస్తవమే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కారణం ఈ సినిమా ఓటీటీ డీల్ పై ఏర్పడిన సందిగ్ధత .
ఈ సినిమా ఓటీటీ డీల్ అలాగే విడుదలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా విశ్వంభర సంక్రాంతి రిలీజ్ గురించి వస్తున్న చర్చలు ఒకవైపు నడుస్తుండగానే.. మరొకవైపు ఓటీటీ రైట్స్ పై ఆసక్తికర అప్డేట్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థలు సోనీ లివ్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో చూసినప్పటికీ.. డిజిటల్ డీల్ ఫైనలైజ్ కాలేదని సమాచారం. పైగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంటుందా? లేక ప్రైమ్ వీడియో దక్కించుకుంటుందా? అనే ఉత్కంఠ ఏర్పడింది.
మరోవైపు బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం కాకా. ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇదే సమయంలో వచ్చే సంక్రాంతికి విశ్వంభర సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సంక్రాంతికి విశ్వంభర వస్తే మరి కాకా సంగతేంటి? ఒకవేళ కాకా కూడా సంక్రాంతికి విడుదల అయితే ఆడియన్స్ ముందుగా ఏ చిత్రానికి ఓటు వేస్తారు? నిజంగానే సంక్రాంతికి వస్తుందా లేక సంక్రాంతి బరి నుంచి కాకా తప్పుకుంటాడా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
also read: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?
విశ్వంభర విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని సుమారుగా రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఏడు లోకాలు అనే సోషల్ ఫాంటసీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. అందులో విఎఫ్ఎక్స్ కారణంగా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంది. దీంతో వీఎఫ్ఎక్స్ కారణంగానే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. విడుదల విషయంలోనే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా రోజుకో కొత్త విడుదల తేదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం . మరి ఇప్పటికైనా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారా లేక మళ్ళీ వాయిదా వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ఓటిటి హక్కుల విషయంలో ఇటు విడుదల తేదీ విషయంలో ఏర్పడిన సందిగ్ధత అభిమానులను ఆందోళనలకు గురిచేస్తుంది. మరి చిత్ర బృందం వీటన్నింటికీ ఎప్పుడు అధికారికంగా చెక్ పెడుతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
🔥 #Vishwambhara OTT Deal & Release Rumors! 🔥
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి రిలీజ్ గురించిన చర్చలు నడుస్తుండగానే, తాజాగా ఓటీటీ రైట్స్ పై ఆసక్తికర అప్డేట్!
సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థలు #SonyLIV & #PrimeVideo చూసినప్పటికీ, ఇంకా డిజిటల్ డీల్ ఫైనలైజ్ కాలేదని టాక్.…— BIG TV Cinema (@BigtvCinema) September 15, 2026